actress kushboo sundar could not get a wheelchair at the airport, created ruckus
mictv telugu

ఎయిర్‌పోర్ట్‌లో సీనియర్ నటి ఖుష్బూకు చేదు అనుభవం

February 1, 2023

టాటా గ్రూప్‌ల సొంతమైన దగ్గర్నుంచి ఎయిర్ ఇండియా వరుస విమర్శలు, వివాదాల్లో కూరుకుపోతోంది. తాజాగా, ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సైతం ఆ సంస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విమానాశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె ట్విట్టర్‌లో పంచుకుంటూ ఎయిరిండియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తింపు కలిగిన నటిగానే కాకుండా తనను గాయపడిన ఓ ప్రయాణికురాలిగా కూడా ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలేం జరిగిందంటే..

జేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్న ఖుష్బూకు కొన్ని రోజుల క్రితం మోకాలికి గాయమైంది. గాయమైన కాలితోనే మంగళవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే అక్కడ ఆమె వీల్ చైర్ కోసం అరగంట పాటు ఎదురుచడాల్సి వచ్చిందట. కాలి నొప్పితో బాధపడుతుంటే కూడా కనీసం ఎవరూ పట్టించుకోలేదని ఎయిర్ ఇండియా సంస్థపై విరుచుకుపడ్డారు ఖుష్బూ. మీ వద్ద కనీసం వీల్ చైర్ కూడా లేదా అంటూ ట్వీట్ చేశారు. చివరికి మీ సిబ్బంది మరో ఎయిర్‌లైన్ నుంచి వీల్‌చైర్‌ను తీసుకొచ్చి తనను తీసుకెళ్లారని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఖుష్బూ ట్వీట్‌కు ఎయిరిండియా వెంటనే స్పందిస్తూ క్షమాపణలు తెలియజేసింది. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని పేర్కొంది. ఈ విషయాన్ని వెంటనే చెన్నై ఎయిర్‌పోర్టు సిబ్బంది దృష్టికి తీసుకెళ్తామని వివరణ ఇచ్చింది.