దక్షిణ చిత్ర పరిశ్రమలోని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటీమణుల్లో కుట్టి పద్మిని ఒకరు. మూడవ ఏట సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి అగ్రకథానాయకులతో స్క్రీన్ షేర్ చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. తన జీవితంలో జరిగిన సంఘటనలను మనసులో దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది. ఆమె మాటల్లోనే ‘సావిత్రి, జమున ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో నా వయసు 16 ఏళ్లు. అప్పట్లో దర్శకులు అడ్జస్ట్‌మెంట్లు చేస్తారా అని అడిగేవారు. నేను ఒప్పుకోలేదు. అలాగే గ్లామర్ డ్రెస్సులంటే ఇష్టం ఉండేది కాదు. అలా కొన్ని సినిమాలు మిస్ అయ్యాయి.
నా కన్నా శ్రీదేవి బాగాఫేమస్ అయ్యింది నాకు ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు నేను 140 మందికి జీతాలు ఇస్తున్నా. అప్పట్లో ఎవరెవరు నాకు అవకాశాలు ఇవ్వలేదో వారందరికీ పని కల్పిస్తున్నా. రూంలోకి రమ్మని పిలిచిన వారికి కూడా సాయం చేస్తున్నా. నేను 23వ ఏట ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అతను మద్యానికి బానిస కావడంతో విడిపోయి తర్వాత పదేళ్లకు ప్రభు అనే వ్యక్తితో రెండో సారి ప్రేమలో పడ్డాను. మాకు ఇద్దరు అమ్మాయిలు. తర్వాత కొంతకాలానికి నా మొదటి భర్త పూట గడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడని కూతురు ద్వారా తెలిసింది. ఆయనతో బెడ్ షేర్ చేసుకోలేను కానీ అలా వదిలేయాలి అనిపించలేదు. మా ఆఫీస్ కిందే ఓ రూం కట్టించి నెలకు 30 వేల జీతానికి పని కల్పించాను. గతేడాదే అయన చనిపోయారు. అటు నా రెండో భర్త పెళ్లయిన 22 ఏళ్లకి నా సెక్రటరీతో లవ్‌లో పడ్డారు. అయినా అతనికి అడ్డు చెప్పలేదు. పిల్లలు కూడా అయ్యాక నా భర్తపై అకస్మాత్తుగా కోపం ఎలా వస్తుంది? ఆ సమయంలో అతనితో అడ్జస్ట్ అయి బతకాలి లేదా ఒంటరిగా ఉండాలి. నేనిప్పుడు ఒంటరిగా సంతోషంగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.