టీవీ నటిపై ప్రేమోన్మాది కత్తి దాడి.. - MicTv.in - Telugu News
mictv telugu

టీవీ నటిపై ప్రేమోన్మాది కత్తి దాడి..

October 27, 2020

ప్రముఖ టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై సోమవారం రాత్రి కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మాల్వీని కోకిలాబెన్ ధీరుభాయి అంబానీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆమె శరీరంపై నాలుగు కత్తిపోట్లు ఉన్నాయి. సకాలంలో ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాపాయం తప్పింది. మాల్విపై దాడి చేసిన నిందితుడిని యోగేశ్‌ కుమార్‌‌‌గా గుర్తించారు. యోగేష్ ఫేస్‌బుక్ ద్వారా మాల్వీకి పరిచయం అయ్యాడని పోలీసులు తెలిపారు.  యోగేష్ తనకు తాను నిర్మాత అని చెప్పుకుని మాల్విని పరిచయం చేసుకున్నాడు. ఇదివరకు ఒకసారి మాత్రమే ఆమె యోగేష్‌ను కలిసినట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు.

‘సోమవారం రాత్రి 9 గంటలకు నార్త్ ముంబైలోని వెర్సోవా ప్రాంతంలోని ఒక కేఫ్‌ నుంచి బయటికి వస్తున్న మాల్వీ మల్హోత్రాపై యోగేశ్‌ కుమార్‌ కత్తితో దాడి చేశాడు. యోగేశ్‌ కుమార్‌ తనకు ఏడాదిగా తెలుసని.. ఇద్దరం స్నేహితులమని మాల్వీ తెలిపింది. యేగేశ్‌.. మాల్వీని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. 

అందుకు ఆమె ఒప్పుకోలేదు. అంతేకాక అతడితో మాట్లాడటం మానేసింది. దీనితో ఆమెపై కోపం పెంచుకున్న యోగేష్ ఆమెపై దాడి చేశాడు.’ అని వెర్సోవా పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మాల్వీ ఫిర్యాదు మేరకు అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.