నన్నూ లైంగికంగా వేధించారు.. మంచు లక్ష్మి - MicTv.in - Telugu News
mictv telugu

నన్నూ లైంగికంగా వేధించారు.. మంచు లక్ష్మి

October 18, 2018

టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచింగ్ వ్యవహారాలపై ఎంత దుమారం రేగుతోందో తెలిసిందే. మీటూ ఉద్యమం పేరుతో బాధితులు కొన్నాళ్లుగా తమకెదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. దీని ప్రభావంతో ఏకంగా కేంద్ర మంత్రి ఎంకే అక్బర్ పదవి పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మీటూ అంటూ టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కూడా తనకెదురైన లైంగిక వేధింపులు గురించి వివరించింది.

67

ఆమె ట్విటర్లో తన అభిమానులతో ముచ్చటిస్తూ ‘నేను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను..  అయితే సినిమా ఇండస్ట్రీలో కాదు. నిజ జీవితంలో నన్ను వేధించారు.. ’ అని తెలిపింది. తన తండ్రి చాలా గొప్పవ్యక్తి అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. తనకు ఇప్పుడే రాజకీయాల్లో వచ్చే ఆసక్తి లేదంది. కాగా, ఆమె మోహన్‌బాబు కూతురు కనుక సినీపరిశ్రమలో లైంగిక వేధింపులు ఎదుర్కొని ఉండదని, బలమైన నేపథ్యంలేని వాళ్లకు అవి మామూలేనని నెటిజన్లు అంటున్నారు. విమానం ఆలస్యం కావడంతో వేచివుంటున్న సమయంలో ఆమె చాటింగ్ చేసింది. ఈ సందర్భంగా ఒక నెటిజన్.. ‘ఈ ఇబ్బందులు అన్నీ ఎందుకు అక్కా.. సుబ్బరంగా ఓ చార్టర్డ్ ఫ్లైట్ కొనుక్కోవచ్చు కదా..’ అని సలహా ఇచ్చాడు. దీనికి ఆమె స్పందిస్తూ ‘నువ్వు కొను.. నేను ఎక్కుతా’ అని దెప్పింది.