Actress Manjima Mohan Was Body Shamed Even At Her Wedding
mictv telugu

నా పెళ్లిలోనే నన్ను వేధించారు.. నాగచైతన్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

December 1, 2022

నాగచైతన్య, గౌతమ్ మీనన్ లా ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది హీరోయిన్ మంజిమా మోహన్. అయితే సినిమా ఫ్లాప్ అవ్వటంతో తెలుగులో రాణించలేకపోయినా.. తమిళంలో మాత్రం మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చేసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ సపరేట్ క్రేజ్ దక్కించుకున్న మంజిమా మోహన్ నటుడు గౌతమ్‌ కార్తిక్‌ను కొద్దీ రోజుల కిందట వివాహం చేసుకుంది. మూడేళ్ల తమ ప్రేమ బంధం తరువాత పెళ్లి చేసుకుని.. తొలిసారి మీడియాతో ముచ్చటించిన ఈ నవ వధువు మంజీమా మోహన్‌ బాడీ షేమింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. చూడడానికి కాస్త బొద్దుగా ఉంటుంది ఈమె. కుష్బూ, మీనా, విద్యా బాలన్‌, నిత్యామీనన్ వంటి తారల మాదిరి కాస్త హెవీ పర్సనాలిటీ. అయితే ఇలాంటి హీరోయిన్స్ పై సహజంగానే బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదురవుతుంటాయి. అవసరం లేకున్నా జనాలు బాడీపై ఉచిత సలహాలు ఇస్తారు. ఇక సోషల్ మీడియాలో అయితే తమ ఫోటోలపై నెటిజన్స్ విపరీతంగా ట్రోల్స్ చేస్తారు. అలాంటిది మంజిమా మోహన్ కి తన పెళ్లి మండపంలోనే బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదురయ్యాయని అనాటి వేధింపులని రివీల్ చేసింది.

కాస్త బరువు తగ్గొచ్చుగా అంటూ ఫోటోలు దిగడానికి వచ్చిన అతిథుల నుండి అవమానకర వ్యాఖ్యలు వినాల్సి వచ్చిందంటూ మీడియాకి చెప్తూ వాపోయింది. శరీరాకృతి విషయంలో మగవారి కన్నా ఎక్కువగా ఆడవారు విమర్శలు ఎదుర్కొవాల్సి రావటం బాధాకరమని చెప్పింది. మొగవారు ఎలా ఉన్నా పర్వాలేదు.. కానీ మహిళల రంగు, రూపు, ఆకృతి.. ఇలా ప్రతి దాన్ని పట్టి పట్టి ఎందుకు చూస్తారో అర్థంకాదని బాధ పడింది. అయితే శరీరాకృతి విషయంలో నేను ఎప్పటి నుండో వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నానని.. కొద్దీ రోజులకి అవి పట్టించుకోవటం మానేసానని.. కానీ సొంత పెళ్ళిలో కూడా ఇలాంటి కామెంట్స్ వినాల్సి వస్తుందని ఊహించలేదని చెప్పుకొచ్చింది. ఇక నాకు బరువు తగ్గాలని అనిపించినప్పుడు తప్పకుండా తగ్గుతానని.. వివాహం తర్వాత కూడా నటిగానే కెరీర్‌ను కొనసాగిస్తానాని.. మంచి కథల్లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పింది నటి మంజీమా మోహన్‌.