కొన్నిసార్లు సెలబ్రెటీల వ్యక్తిగత జీవితంపై అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంటుంది. క్రాస్ చెక్ చేసుకోకుండా ఇచ్చే వార్తలు స్టార్స్‌ని ఇబ్బంది పెడతాయి. దాంతో తప్పని పరిస్థితుల్లో వివరణ ఇవ్వాల్సి వస్తుంది. నటి మీనాకి సైతం ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
బాలనటిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకుని బిజినెస్ మెన్ని పెళ్లాడింది మీనా. అయితే విధి వక్రీకరించి చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. ఇలాంటి సమయంలో ఆమెకి అండగా ఉండాల్సిన కొందరు తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ నటి మీనా తమిళ సోషల్ మీడియాపై ఫైర్ అయింది. మీనా రెండో పెళ్లి చేసుకుంటుందని కొద్దీ రోజులుగా అరవ మీడియా వార్తలు రాస్తూన్న నేపథ్యంలో మీనా స్పందించింది.
తన కోసం కాకపోయినా పిల్లల కోసం పెళ్ళికి ఒప్పించారని.. భర్త క్లోజ్ ఫ్రెండ్‌తో రెండో పెళ్ళికి మీనాని కన్విన్స్ చేసారని ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదంటూ తాజాగా రెండవ పెళ్లి కథనాలని కొట్టిపారేసింది నటి మీనా. తన వ్యక్తిగత విషయాల పట్ల తమిళ మీడియా చేస్తున్న ఈ హడావిడి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లి వార్తలను ఖండిస్తూ తమ ప్రైవసీని అందరూ గౌరవించాలని కోరింది.సెలబ్రిటీస్ అందరి విషయంలో ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటాయి. వారు ఎంత మొత్తుకున్నా సరే ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు అంటూ వాపోయింది. ఇక మీనా భార్త విద్యాసాగర్ మరణం తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్లారు. అయితే మీనా పేరెంట్స్ ఆమెను మరో పెళ్లి చేసుకోవాలని సలహా ఇస్తున్నా మీనా మాత్రం ప్రస్తుతం భర్త ఆలోచనలతోనే కాలం గడుపుతున్నారు.