Actress Meena's Secret Wedding To Kiccha Sudeep Hit The Headlines
mictv telugu

భర్త మరణించిన కొద్దిరోజులకే.. కిచ్చా సుదీప్‌తో హీరోయిన్ మీనా సీక్రెట్ మ్యారేజ్ ?

October 26, 2022

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ మీనా అంటే తెలియని వారుండరు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ వంటి భాషల్లో వందల చిత్రాలలో నటించింది మీనా. 1982లో శివాజీ గణేశన్ నటించిన నెంజంగల్ అనే చిత్రంలో బాలనటిగా సినీ ప్రయాణం మొదలుపెట్టిన మీనా కెరీర్ మొన్నటి వెంకటేష్ దృశ్యం వరకు కొనసాగుతూనే వస్తుంది. రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్, మమ్ముటీ, మోహన్‌లాల్, నాగార్జున, వెంకటేష్, విజయ్, అజిత్ మొదలైన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలందరితో పనిచేసిన మీనాపై కొన్ని బ్యాడ్ రూమర్స్ వస్తుంటాయి. మీనా భర్త ఆకస్మికంగా మొన్ననే మృతి చెందారు. ఆయన మరణం ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయంగానే ఉన్న నేపథ్యంలో ఆమెపై ఒక విచిత్రమైన వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. నటిగా 40 సంవత్సరాలను సక్సెస్ ఫుల్‌గా సొంతం చేసుకున్న మీనా కిచ్చా సుదీప్ తో సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నట్టు కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.


ఈగ, సైరా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, మీనాకి ఎప్పటినుండో మంచి స్నేహితుడట. మీనా పెళ్లికి ముందు నుండే వీరిద్దరికి రిలేషన్ ఉన్నట్టు చెప్తున్నారు. అయితే సీక్రెట్ మ్యారేజ్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటుడు కిచ్చా సుదీప్‌ని మీనా సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలీ వార్తలలో నిజమెంత? నిజంగానే మీనా సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందా? అంటే పెళ్లి మాత్రం జరిగింది. కానీ అది ఎప్పుడో మీనా కెరీర్ పీక్స్ లో ఉన్నపడి విషయం అంటూ తమిళ సీనియర్ పాత్రికేయులు చెప్తున్న మాట. అందరు భావిస్తున్నట్టు మీనా ఇప్పుడు పెళ్లి చేసుకోలేదని.. 25సంవత్సరాల క్రితం సుదీప్ తో సీక్రెట్‌ మ్యారేజ్ జరిగినట్టు తెలుస్తుంది. అయితే సినీ స్టార్స్ విషయంలో ఏదైనా సాధ్యమే. వారి వ్యక్తిగత జీవితాల్లో ఊహకందని సినిమా ట్విస్టులు, బోలెడన్ని సీక్రెట్స్ ఉంటాయన్నది మాత్రం పచ్చి నిజం.