జయప్రదపై నగ్మ ఫైర్.. సుశాంత్ ఆత్మహత్య కేసులో.. - MicTv.in - Telugu News
mictv telugu

జయప్రదపై నగ్మ ఫైర్.. సుశాంత్ ఆత్మహత్య కేసులో..

September 18, 2020

actress Nagma fires at jayaprada

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు కాస్తా డ్రగ్స్ కేసుగా మారింది. దీనిపై పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఇటీవల భోజ్‌పూరి నటుడు, ఎంపీ రవి కిషన్‌ బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వినియోగం ఉందంటూ పార్లమెంట్ లో తెలిపారు. దీనికి సీనియర్ నటి, బీజేపీ ఎంపీ జయప్రద మద్దతిచ్చారు. ఈ క్రమంలో నటి, కాంగ్రెస్‌ నాయకురాలు నగ్మ.. జయప్రదపై సంచలన వ్యాఖ్యలు చేసింది. 

సుశాంత్‌‌ కేసు నుంచి ప్రజలను దారి మళ్లించడానికి డ్రగ్స్‌‌ ను తెర మీదకు తెచ్చారంటూ ఆరోపణలు చేసింది. ‘సీబీఐ, ఎన్‌సీబీ, ఈడీ దయచేసి సుశాంత్‌ కేసులో ఏం జరుగుతుందో బీజేపీ నాయకులు, జయప్రద గారికి తెలియజేయండి. సుశాంత్‌ చనిపోయి ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయింది. దేశ ప్రజలంతా సుశాంత్‌ మృతికి కారకులేవరో తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు. కానీ, ఫలితం లేదు. దీన్ని కవర్‌ చేయడానికి ఉన్నట్లుండి బీజేపీ నాయకులు బాలీవుడ్‌లో డ్రగ్స్ కల్చర్ గురించి మాట్లాడుతున్నారు.’ అని నగ్మ ట్వీట్‌ చేసింది.