41 ఏళ్లకు గర్భవతి అయిన ప్రముఖ హీరోయిన్ - MicTv.in - Telugu News
mictv telugu

41 ఏళ్లకు గర్భవతి అయిన ప్రముఖ హీరోయిన్

May 10, 2022

పెళ్లి చేసుకున్న హీరోయిన్లు గర్భం దాల్చిన తర్వాత ఆయా ఫోటోలను షేర్ చేయడం ఇప్పుడు కొత్త ట్రెండుగా మారింది. ఇంతకు ముందు శ్రియ, కరీనా కపూర్ ఇటీవలి కాలంలో కాజల్, ప్రణీత, సంజన గల్రాని వంటి తారలు బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కోవలో తాజాగా మరో హీరోయిన్ తను తల్లి కాబోతున్నట్టు వెల్లడించింది. తెలుగులో హిట్ సినిమాలతో అలరించిన నమిత తన పుట్టినరోజు (మే 10) సందర్భంగా ఈ విషయాన్ని స్వయంగా తెలిపింది. బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘నాలో కొత్త మార్పు మొదలైంది. కొత్త జీవితం, కొత్త మలుపులు, కొత్త పిలుపులు, మాతృత్వపు అనుభవం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఇంతకు ముందెన్నడూ లేని కొత్త ఫీలింగ్ ఇది’ అని తెలిపింది. కాగా, 2017లో వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకున్న నమిత.. ప్రస్తుతం 41 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం విశేషం.