సినిమాలు విడుదలైతే ఎగబడి చూస్తారు కానీ.. సినిమా స్టార్స్ అంటే మాత్రం అందరికి చిన్నచూపే. ముఖ్యంగా హీరోయిన్స్ పై కాస్త వివక్ష ఎక్కువగానే ఉంటుంది. వ్యక్తిగత విమర్శలు, బాడీ షేమింగ్, సంబంధాలు అంటకట్టడం వంటివి హీరోయిన్స్ విషయంలో సహజం. డబ్బుల కోసం ఏదైనా చేస్తారు అసలు వారికి వ్యక్తిత్వం ఉంటుందా అన్న స్థాయిలో హీరోయిన్స్ ని చూస్తారు జనాలు. కానీ అలాంటి విమర్శలకు కొందరు హీరోయిన్స్ అతీతం. కీర్తి సురేష్, సాయిపల్లవి వంటి యంగ్ హీరోయిన్స్ హుందాతనాన్ని అభిమానిస్తారు జనాలు. ఇదే కోవలోకి మరో ట్యాలెంటెడ్ హీరోయిన్స్ నిత్యా మీనన్ కూడా వస్తారు. గ్లామర్ షోకి ఆమడ దూరంలో ఉండే నిత్యా పద్ధతైన పాత్రలనే ఎంచుకుంటారు. కాసుల కోసం ఎక్స్ పోజింగ్ చేయదన్న పేరు ఈమెకి ఉంటుంది. అయితే ప్రొఫెషినల్ గానే కాకుండా నిత్యా పర్సనల్ క్యారెక్టర్ కూడా సూపర్ అంటారు. ముఖ్యంగా సోషల్ సర్వీస్ లోను నిత్యా ముందుంటుందని.. దానికి ఉదాహరణే తాజాగా మొన్న కృష్ణాపురం జరిగిన ఉదంతం.
నిత్యా మీనన్ సడెర్న్ గా ఒక ప్రభుత్వ పాఠశాలకు వచ్చి పిల్లలకు పాఠం చెప్పింది. ఇదేదో సినిమా షూటింగ్ కోసం కాదు. నిజంగానే నిత్యా టీచర్ అవతరమెత్తి పిల్లలకు ఇంగ్లిష్ పాఠం చెప్పింది. ఓ మలయాళ సినిమా షూటింగ్ కోసం కృష్ణాపురం అనే గ్రామానికి వచ్చిన నిత్యా దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి.. విద్యార్థులు, టీచర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా పిల్లలకు ఇంగ్లిష్ పాఠం చెప్పారు. చక్కటి తెలుగులో మాట్లాడుతూ, ఇంగ్లిష్ పాఠాన్ని చదివి వినిపిస్తూ, తెలుగులో అర్థం చెబుతూ పాఠశాలలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొత్త సంవత్సరం పిల్లలతో అలా గడిచిపోయింది అంటూ నిత్యా కూడా ఆ వీడియోని తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసింది. అయితే ఈ వీడియోకి నెటిజన్స్ కాంప్లిమెంట్స్ చేస్తున్నారు. అందరు హీరోయిన్స్ లా షూటింగ్ గ్యాప్ లో కారవాన్లో కాకుండా పిల్లలతో గడిపింది.. చక్కటి తెలుగులో పాఠాలు చెప్పింది అంటూ ప్రశంసిస్తున్నారు.