actress nithya menon clarity on her pregnancy news
mictv telugu

పెళ్లి కాకుండానే గర్భవతైన నిత్యామీనన్ ?

November 19, 2022

హీరోయిన్ నిత్యా మీనన్ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి చేసుకోకుండానే గర్భం ఏంటీ అంటూ నిత్యా ఫోటోలపై పెద్ద చర్చే నడుస్తుంది. ప్రెగ్నెన్సీ ఫోటో షూట్ ని తలపించేలా ఉన్న ఈ ఫోటోలని నిత్యానే సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం గమనార్హం. అయితే సెలబ్రటీల లైఫ్ లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చన్న నమ్మకంతో నిత్యా నిజంగానే గర్బవతి అయినట్టు నమ్మేశారు కొందరు నెటిజన్స్. ఈ వార్తలపై తాజాగా నిత్యా మీనన్ స్పందించిది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మరో పోస్ట్ పెట్టి తన ప్రెగ్నెన్సీ వార్తలకు చెక్ పెట్టింది. మొన్న అభిమానులతో పంచుకున్న బేబీ బంప్‌ ఫోటోలు నిజమైనవి కాదని చెప్పకనే చెప్పింది.

నిత్యామీనన్ ప్రస్తుతం ‘వండర్ ఉమెన్’ మూవీలో నోరా అనే గర్భిణీ స్త్రీగా నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే ఇలా చేసినట్టు తెలుస్తోంది. తాజాగా షేర్ చేసిన బేబీ బంప్‌ ఫొటోలని చూసి తాను ప్రగ్నెంట్ అని రూమర్ వ్యాప్తి చెందుతుందని ముందే గ్రహించిన నిత్యామీనన్.. ఒక చిన్న నోట్ ద్వారా ట్విస్ట్ రివీల్ చేస్తూ క్లారిటీ ఇచ్చేసింది. ‘ప్రగ్నెన్సీ ఎప్పుడూ అందంగా కనిపించదు. అయితే నోరా పాత్ర పోషించడాన్ని చాలా ఆస్వాదించాను. రాబోవు రోజుల్లో మరిన్ని ఫొటోలు షేర్‌ చేస్తాను. గమనిక: నేను నిజంగా ప్రగ్నెంట్ కాదు’’ అని నిత్యామీనన్ రాసుకొచ్చింది.