Actress Nithya Menon posted a pregnancy kit photo
mictv telugu

గర్భం దాల్చిన నిత్యామీనన్.. వండర్ బిగిన్స్ అంటూ పోస్ట్

October 28, 2022

పాత్ర ఏదైనా తన సహజత్వ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటి నిత్యామీనన్. కేవలం నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఒప్పుకుంటూ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. సినిమాల పరంగా ఈ మధ్య కొంత వెనుకబడిన నిత్యా.. సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ప్రెగ్నెన్సీ కిట్ పిక్‌ను షేర్ చేసిన నిత్య దాంతో పాటు ‘అండ్ ది వండర్ బిగిన్స్’ అంటూ కామెంట్ చేసి అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ పోస్ట్‌కు మహిళ ఎమోజీని జత చేయడంతో గర్భం ఏమైనా దాల్చిందా? అనే అనుమానం అభిమానుల్లో మొదలైంది. కానీ, అంతలోనే తన చేస్తున్న చిత్రం ప్రమోషన్ గురించి ఇలా చేసి ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. ఆమె నటించబోయే తదుపరి చిత్రానికి వండర్ వుమెన్ అనే టైటిల్ పెట్టారని, ఆ సినిమా ప్రమోషన్‌ను నిత్య ఈ విధంగా చేసిందని అనుకుంటున్నారు. కాగా, ఆమె నటించిన పాపులర్ వెబ్ సిరీస్ బ్రీత్.. ఇన్ టు ది షాడోస్ మొదటి భాగం హిట్ కొట్టగా ఇప్పుడు రెండో సీజన్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ట్రైలర్ ఆకట్టుకోగా, నవంబర్ 9న ఓటీటీలో విడుదలయ్యే ఈ సిరీస్‌లో అభిషేక్ బచ్చన్, అవినాష్ సబర్వాల్ నటించారు.