ఎన్టీఆర్‌ను చూస్తుంటే ఏడుపొస్తుంది : సినీ నటి - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్టీఆర్‌ను చూస్తుంటే ఏడుపొస్తుంది : సినీ నటి

April 7, 2022

ntr

‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో భారతీయ చిత్ర పరిశ్రమకు పరిచయమైన బ్రిటీష్ నటి ఒలీవియా, సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమాలో కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్‌ను చూస్తుంటే ఏడుపొస్తుందని తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి సినిమాలో అవకాశం రావడం ఆనందంగా ఉంది. అద్భుతమైన నటులతో కలిసి పని చేశాను. తారక్ సింగిల్ టేక్‌లోనే సీన్ ఓకే చేస్తాడు. కొమురం భీముడో పాటలో ఆయన నటనను చూసి భావోద్వేగానికి గురయ్యా. రాం చరణ్ మంచి స్నేహితుడు. మేమిద్దరం లండన్ గురించి ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం. నాటు నాటు అనే పాటలో డ్యాన్స్ చాలా బాగుంది. నా బాయ్ ఫ్రెండ్ ఆ స్టెప్పులను ప్రయత్నిస్తున్నాడు. రాజమౌళికి నటుల నుంచి నటనను ఎలా రాబట్టాలో తెలుసు’ అంటూ వివరించింది.