టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, సీనియర్ నటి పవిత్రా లోకేష్ కు సంబంధించి పలు వార్తలు వైరల్ అవుతూ ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని రోజులుగా ఈ వార్త ప్రచారంలో ఉన్నా నరేష్, పవిత్ర లోకేష్ మాత్రం ఆ వార్తలను ఖండించలేదు. మరోవైపు వీరిద్దరూ మహాబలేశ్వర్లో స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్న వీడియో వైరల్ అయ్యింది. ఇకపోతే ఈ వ్యవహారాలపై పవిత్ర లోకేశ్ మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ తొలిసారిగా మీడియా ముందు మాట్లాడారు. తమది ప్రేమ పెళ్లి అని వెల్లడించారు. పవిత్రను హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నానని, అయితే ఉద్దేశపూర్వకంగానే మ్యారేజి సర్టిఫికెట్ తీసుకోలేదని తెలిపారు. మ్యారేజి సర్టిఫికెట్ విదేశీ విధానం అని, అందుకు తాము వ్యతిరేకం అని వివరించారు. కానీ, ఆధార్ కార్డు, పాస్ పోర్టును పరిశీలిస్తే పవిత్ర తన భార్యే అని స్పష్టమవుతుందని వివరించారు. తామిద్దరం భార్యాభర్తలుగా అనేక కార్యక్రమాలకు హాజరయ్యామని కూడా సుచేంద్ర చెప్పారు.
మన దేశంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానందున తాను మౌనంగా ఉన్నానని, ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేయడం చాలా తేలికని సుచేంద్ర ప్రసాద్ అన్నారు. పవిత్రకు ఇటువంటి సంబంధాలు కొత్తేం కాదని చెప్పారు. 16 ఏళ్లకే పెళ్లయి ఇద్దరు పిల్లల తల్లి కూడా అయిన పవిత్ర లోకేష్ మాటలకు సుచేంద్ర ప్రసాద్ ఇప్పటి వరకు ఏ విధంగానూ స్పందించలేదు. జరిగినదంతా చూస్తూ మౌనంగా ఉన్నాడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా పవిత్ర లోకేష్ తన భార్య అని ప్రూఫ్ తో వివరణ ఇచ్చారు. పవిత్ర స్పందిస్తూ, సుచేంద్ర ప్రసాద్ తో తనకు పెళ్లి కాలేదని తెలిపారు.