పాయల్ కరోనా టెస్ట్.. మరీ ఇంత ఓవర్ యాక్షనా? - MicTv.in - Telugu News
mictv telugu

పాయల్ కరోనా టెస్ట్.. మరీ ఇంత ఓవర్ యాక్షనా?

September 26, 2020

Actress payal rajput coronavirus test

లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్‌లు కేంద్రం చేపట్టిన అన్‌లాక్ ప్రక్రియతో మళ్ళీ మొదలయ్యాయి. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ సినిమా షూటింగ్‌లు జరుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా షూటింగులు మొదలయ్యాయి. తెలుగు చిత్రసీమలో కూడా షూటింగ్‌ల సందడి మొదలైంది. షూటింగులలో పాల్గొంటున్న నటీనటులకు, సిబ్బందికి విధిగా కరోనా వైరస్ టెస్టులు చేస్తున్నారు. షూటింగ్ జరుగుతున్న ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలను పాటిస్తున్నారు. 

ఈ క్రమంలో షూటింగ్‌లో పాల్గొన్న నటి పాయల్ రాజ్‌పుత్‌‌కు కరోనా పరీక్షలు చేశారు. ముక్కులో నుంచి శాంపిల్ తీసుకునే క్రమంలో ఆమె చిన్నపిల్లలా భయపడింది. దీనికి సంబంధించిన వీడియోను పాయల్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ‘మొత్తానికి తిరిగి సెట్స్ మీదకు వచ్చా. కరోనా శాంపిల్స్ తీసుకునే సమయంలో చాలా భయమేసింది. ముక్కులో తిప్పుతూ శాంపిల్స్ తీసుకోవడం ఇబ్బందిగా అనిపించింది. పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చింది’ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాయల్ ఓవర్ యాక్షన్ చేయకని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు నెటిజన్లు పాయల్ ఈ వీడియోలో క్యూట్‌గా ఉందని కామెంట్లు పెడుతున్నారు.