నన్ను చేతబడి చేసి సెక్స్ స్కాంలో ఇరికించారు.. నా కన్యత్వం వల్లే ఆమెకు స్టార్‌డమ్ : బాలీవుడ్ నటి - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను చేతబడి చేసి సెక్స్ స్కాంలో ఇరికించారు.. నా కన్యత్వం వల్లే ఆమెకు స్టార్‌డమ్ : బాలీవుడ్ నటి

May 5, 2022

 

బాలీవుడ్ సీనియర్ నటుడు కం హీరో, ప్రస్తుత టీఎంసీ లోక్‌సభ సభ్యుడు శత్రుఘ్న సిన్హాపై బాలీవుడ్ నటి పూజా మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. నటిగా ఎదుగుతున్నప్పుడు ఆయన తన భార్యతో కలిసి తనపై చేతబడి చేసి సెక్స్ స్కాంలో పాల్గొనేలా చేశాడని ఆరోపించింది. ఆయనతో పాటు కుటుంబసభ్యులు కూడా తరచూ చేతబడి చేస్తూ, అపస్మారక స్థితిలో తీసుకెళ్లారని మండిపడింది. ‘శత్రుఘ్న సిన్హా తన కూతురు సోనాక్షి సిన్హాను స్టార్ హీరోయిన్ చేయడం కోసం నా కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టాడు. నేను ఎదుగుతున్న క్రమంలో చేతబడి, డ్రగ్స్‌తో 17 ఏళ్లుగా నన్ను వశపరుచుకొని నా కెరీర్ నాశనం చేశాడు. 35 సినిమాలను నాకు దూరం చేశాడు. అతని కోసమే నేను పెళ్లి చేసుకోలేదు. ఆయన భార్య పూనమ్ సిన్హా బాలీవుడ్‌లో వేశ్యలే పని చేస్తారని, అందుకే సీనీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నట్టు చెప్పింది. వాళ్లింటికి వెళ్లినప్పుడల్లా ఏదో తినిపించి చేతబడి చేసేవారు. ఆ కుటుంబానికి అత్యాశ అనే దయ్యం పట్టుకుంది. కోట్ల రూపాయలు ఇచ్చిన నా తండ్రిని కూడా వాళ్లు మోసం చేశారు ’ అంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. కాగా హిందీ బిగ్ బాస్‌తో నటి పూజా మిశ్రా పాపులర్ అయ్యింది.