మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మూడో పెళ్లి గురించి నటి పూజిత కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీజకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరుగగా, రెండో భర్త కల్యాణ్ దేవ్‌కు విడాకులిచ్చి మూడో పెళ్లికి సిద్ధపడిందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మాట్లాడిన పూజిత ‘చిరంజీవి కుటుంబం గురించి నాకు లోతుగా తెలియదు.
కానీ చాలా గౌరవం, పెద్దరికం ఉన్న కుటుంబం వారిది. చిన్న కూతురు కావడంతో శ్రీజకు ఓవర్ ఫ్రీడం, గారాబం ఎక్కువయ్యాయి. దాంతో ఆమె మనస్సు స్థిరంగా ఉండలేకపోతోంది. ఇద్దరిని పెళ్లి చేసుకున్నా ఆమె అడ్జెస్ట్మెంట్ మెంటాలిటీ లేదు. ఇప్పుడు మూడో పెళ్లి చేసుకుంటే చిరంజీవి పరువు మొత్తం తీసినట్టవుతుంది. ఆ పని చేయకపోవడం బెటర్’ అంటూ వ్యాఖ్యానించింది. అటు కల్యాణ్ దేవ్ నటించిన రెండు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల్లో మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ రాలేదు. దీంతో వీరి విడాకులు కన్ఫార్మ్ అంటూ వదంతులు వచ్చాయి. అంతేకాక, శ్రీజ తన సోషల్ మీడియా ఖాతా నుంచి కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో వదంతులకు బలం చేకూరినట్టయింది. చూద్దాం ఏం జరుగుతుందో.