Actress Poonam Kaur participated in Bharat Jodo Yatra
mictv telugu

రాహుల్ పాదయాత్రలో పీకే.. వైరల్ అవుతున్న వీడియో

October 29, 2022

Actress Poonam Kaur participated in Bharat Jodo Yatra

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర పేరిట కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతోంది. విరామం అనంతరం శనివారం యాత్ర పునప్రారంభం అవగా, ఈ యాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

నటి కం హీరోయిన్ పూనమ్ కౌర్ శనివారం యాత్రలో రాహుల్ వెంట నడిచారు. యాత్రలో పాల్గొంటూ ఆయనతో మాట్లాడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమెతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు కూడా శనివారం యాత్రలో పాలు పంచుకున్నారు. నాలుగో రోజు జరుగుతున్న ఈ యాత్రలో సుమారు 20 కిలోమీటర్లు నడిచిన తర్వాత జడ్చర్లకు చేరుకొని చౌరస్తాలో జరిగే సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు చేరికలు ఉంటాయని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. కాగా, శుక్రవారం రాత్రి రాహుల్ గాంధీ ధర్మాపూర్‌లో బస చేశారు.