అసిఫ్ అలీతో షామ్నా ఖాసీం ఎంగేజ్మెంట్.. ఎవరో గుర్తుపట్టారా? - MicTv.in - Telugu News
mictv telugu

అసిఫ్ అలీతో షామ్నా ఖాసీం ఎంగేజ్మెంట్.. ఎవరో గుర్తుపట్టారా?

June 1, 2022

ఫోటో చూసి కన్ఫ్యూజ్ అయ్యారా? గుర్తుపట్టడానికి ఏముంది..? హీరోయిన్ పూర్ణ పేరుకు బదులు మరేదో పేరు వేశారనుకుంటున్నారా? కానీ ఇది నిజం. ఆమె అసలు పేరు షామ్నా ఖాసిం. తెలుగులో ‘శ్రీమహలక్ష్మి’ సినిమాతో వెండితెరకు పరిచయమై.. ఆ తర్వాత ‘సీమ టపాకాయ్’, ‘అవును’ సినిమాలతో ఫేమస్ అయింది. ఈ మధ్యే ‘అఖండ’ మూవీతో మంచి పేరు తెచ్చుకొని తెలుగు టీవీ ఛానెల్స్‌లో పలు షో లు చేస్తోంది. ఇక అసలు విషయానికొస్తే.. ఇన్ స్టా గ్రామ్ వేదికగా పూర్ణ అలియాస్ షామ్నా ఖాసిం.. తనకు కాబోయే వాడిని పరిచయం చేసింది.

షానిద్ అసిఫ్ అలీ అనే వ్యక్తితో ఎంగేజ్ మెంట్ అయిందని రింగ్ ఎమోజీ పోస్ట్ చేసి నెటిజన్లకు సర్ ప్రైజ్ ఇచ్చింది పూర్ణ. ఇంతకీ ఎవరీ అసిఫ్ అలీ అని ఆరా తీయగా.. ఈయన ఓ బిజినెస్ మాన్ అని తెలిసింది. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ మరియు సీఈఓ. కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి అని తెలుస్తుంది. ఇక ఇది కుటుంబ సభ్యులు నిర్ణయించిన వివాహమా? లేక ప్రేమ వివాహమా? అనేది తెలియాల్సి ఉంది. ఒకే మతానికి చెందినవారు కావడంతో పెద్దలు కుదిర్చిన వివాహమేనంటున్నారు చాలామంది నెటిజన్లు. ఇక పూర్ణ కాబోయేవాడిని పరిచయం చేయడంతో అభిమానులు, సన్నిహితులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. వారి జంట ముచ్చటగా ఉందని కితాబు ఇస్తున్నారు. ప్రస్తుతం పూర్ణ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది.