అందరితో అలాంటి పని చేయలేక ‘ఢీ’ నుంచి తప్పుకున్నా : నటి పూర్ణ - MicTv.in - Telugu News
mictv telugu

అందరితో అలాంటి పని చేయలేక ‘ఢీ’ నుంచి తప్పుకున్నా : నటి పూర్ణ

June 3, 2022

తెలుగులో పాపులర్ అయిన కేరళ అమ్మాయి షామ్నా ఖాసిం అలియాస్ పూర్ణ ఇటీవల త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. యూఏఈలో స్థిరపడిన షానిద్ అసిఫ్‌ను తన కాబోయే వాడిగా సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది. పలు సినిమాల్లో నటించిన పూర్ణ అదే సమయంలో పలు టీవీ షోలలో జడ్జిగా వ్యవహరించింది. ఇందులో ‘ఢీ’ డ్యాన్స్ ప్రోగ్రాం ప్రముఖమైనది. అయితే కొన్నాళ్లు ఆ షోలో పనిచేసిన పూర్ణ ఆ తర్వాత తప్పుకుంది. ఇందుకు గల కారణాన్ని అడుగగా షాకింగ్ సమాధానం ఇచ్చింది. ‘ఆ షోలో పనిచేయాలంటే అందరికీ కౌగిలింతలు ఇవ్వాలి. డ్యాన్స్ బాగా చేశారంటూ మెచ్చుకొని డ్యాన్సర్లకు హగ్స్ ఇవ్వాలి. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్లను హగ్ చేసుకోవాలి. అంతేకాక, ఆ షోలో ఉన్న యాంకర్లను కూడా హగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అందరికీ హగ్స్ ఇవ్వడం ఇష్టం లేకే షో నుంచి తప్పుకున్నా’నని వివరించింది. మరి ఇది నిజమా? కాదా? అనే విషయం ఆ షో నిర్వాహకులే చెప్పాలి.