actress poorna serious on cyber crime about fraud on name of her husband whatsapp number
mictv telugu

పెళ్ళై 15రోజులు కాలేదు.. అప్పుడే నటి పూర్ణ సీరియస్‌ వార్నింగ్‌

November 10, 2022

నటి ‘ఢీ’ షో జడ్జి పూర్ణ పెళ్లి జరిగి 15రోజులు కూడా అవ్వలేదు. అప్పుడే తన భర్త వివాదంలో చిక్కుకున్నాడు. సైబర్ యాక్టివిటీస్ విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో సైబర్ నేరాలు సైతం విపరీతమవుతున్నాయి. కరెంట్‌ బిల్లులు కట్టడం మొదలు.. ఇంట్లోకి కావాల్సిన సరుకులు, బట్టలు ఇలా ఒక్కటేమిటి.. ప్రతిది ఆన్‌లైన్‌ పేమెంట్స్ జరుగుతుండటంతో సైబర్ క్రైమ్ రేట్స్ జోరందుకున్నాయి. ఈ మధ్య కాలంలో.. మన స్నేహితుల, బంధువుల వాట్సాప్ నంబర్స్ నుండి డబ్బులు అవసరమున్నాయని మెసేజిలు రావటం చూస్తూనే ఉన్నాం. తీరా ఏంటా కష్టమని ఆరాతీస్తే అసలు ఆ మెసేజ్ పెట్టింది వారు కానేకాదని తేలుతుంది. ఇదంతా సైబర్ కేటుగాళ్ల పని అని తెలుసుకుని కంగుతినాల్సి వస్తుంది. అయితే సామాన్యులకు కాకుండా సెలబ్రెటీలకు సైతం ఇలాంటి చిక్కులు వస్తున్నాయి. తాజాగా నటి పూర్ణ భర్త వాట్సాప్ నంబర్ నుండి ఇలాంటి మెసేజిలు రావటం జరిగిందని వాపోతుంది నటి పూర్ణ.

తన భర్త ఫోటో వాట్సాప్‌ డీపీగా పెట్టిన ఓ నంబర్‌ నుంచి.. కొందరు లావాదేవీలు జరుపుతున్నారని.. అలా ఎవరైనా మోసపోతే.. అందుకు తన భర్త కారణం కాదంటూ సోషల్‌ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది పూర్ణ. ప్రసుత్తం ఈ పోస్ట్‌ వైరలవుతోంది. దుబాయ్‌లో స్థిరపడిన వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో షానిద్ ఆసిఫ్ అలీని.. అక్టోబర్ 25న పెళ్లాడిన పూర్ణ తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ ఒకటి పెట్టింది. ‘‘+971 52 724 5366 ఫోన్ నంబరు కలిగిన వాట్సాప్ అకౌంట్ ద్వారా నా భర్త షానిద్ పేరుతో ఓ వ్యక్తి.. కొందరిని కాంటాక్ట్ చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. అయితే అది నా భర్త నంబర్‌ కాదు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రొఫైల్‌తో మీరు ఏవైనా లావాదేవీలు జరిపితే దానికి నా భర్త బాధ్యుడు కాదు. అలా మీలో ఎవరైనా మోసపోతే.. నా భర్తకు సంబంధం లేదు’’ అని పోస్ట్‌ చేసింది పూర్ణ.