Actress Pragathi Make Interesting Comments On Second Marriage
mictv telugu

రెండో పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నటి ప్రగతి

January 3, 2023

హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి చిన్న వయసులోనే నటి ప్రగతి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు హీరో తల్లి, వదిన పాత్రలు చేసుకుంటూ తనదైన గుర్తింపు తెచ్చుకుంది. నాలుగు పదుల వయసులోనూ జిమ్‌లో వ్యాయామాలు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. వాటిని చూసిన నెటిజన్లు ఈ వయసులో ఎలా సాధ్యమంటూ ఆశ్చర్యపోతుంటారు. అలాంటి ప్రగతి ఇటీవల ఒ ఇంటర్వ్యూలో తన కెరీర్, రెండో పెళ్లిపై ఆసక్తికరంగా స్పందించారు. ‘హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసినా తర్వాత తెలిసీ తెలియక కొన్ని తప్పులు చేయడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాను. పెళ్లి తర్వాత కొన్ని సమస్యలు వచ్చి విడాకులు తీసుకున్నాను. అలా సినిమాకి, నాకు గ్యాప్ పెరిగింది. తర్వాత ఓ సినిమా షూటింగ్ కోసం జడ వేసుకొని వెళ్తే ఆ దర్శకుడు ఇంత చిన్న వయసులో హీరోయిన్‌కి అమ్మగా చేస్తుందేంటీ? అని చెప్పడంతో ఏడ్చేశాను. తర్వాత బాధపడడం మానేశాను. ఇప్పుడు కొందరు రెండో పెళ్లి గురించి ఎందుకు ఆలోచించడం లేదని అడుగుతున్నారు. పెళ్లి అని అనను కానీ ఓ తోడు కావాలనిపిస్తోంది. కానీ నన్ను భరించడం అంత ఈజీ కాదు. కొన్ని విషయాల్లో చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను. అదే 20లలో అయితే అడ్జస్ట్ అయ్యేదానినేమో. రాబోయే వ్యక్తి నాలా మెచ్యూర్డ్ పర్సన్ అయి ఉండాలి. అలాగే సింగిల్ పర్సన్ కావాలి. అలాంటి పర్సన్ దొరకడం కష్టం. ఒకవేళ రావాలని రాసి ఉంటే అదే జరుగుతుందని నమ్ముతాను’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. వ్యాయామం గురించి అడిగితే స్టిమ్‌గా మారాలని కాదు కానీ బాడీ ఫిట్‌గా ఉండడానికి మాత్రమే జిమ్ చేస్తానని తెలిపింది.

ఇవి కూడా చదవండి : 

బ్లూ ఫిలిమ్స్ పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్

మైండ్ బ్లోయింగ్ మాస్.. రవితేజకి తోలి 100కోట్లు ?

అమెరికాలో బాలయ్య-మెగా ఫ్యాన్స్ ఫైటింగ్

బీజేపీని దెబ్బ కొట్టింది నినే.. కేసీఆర్ కాదు ED,CBI ఎవనికి భయపడేది లేదు.. ఎమ్మెల్యే కొనుగోలు పై పైలట్ రోహిత్ రెడ్డి