Home > Featured > భర్తతో ఎఫైర్? హీరోయిన్‌ను చితకబాదిన హీరో భార్య.. వీడియో వైరల్

భర్తతో ఎఫైర్? హీరోయిన్‌ను చితకబాదిన హీరో భార్య.. వీడియో వైరల్

సినిమా పరిశ్రమలో హీరో, హీరోయిన్ల మధ్య ఆన్‌స్క్రీన్ రొమాన్స్ మామూలే. అయితే ఇది అంతటితో ఆగితే పర్వాలేదు, కానీ, నిజ జీవితంలో కూడా అలాగే ఉంటే కాపురాలు కూలుతాయి. ఎఫైర్‌పై ఎలాంటి ఆధారాలు లేకపోయినా, అనుమానం ఉంటే చాలు కొంప కొల్లేరవడానికి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే.. హీరో అయిన భర్తతో కలిసి హీరోయిన్ కారులో వెళ్తుండగా, హీరో భార్య వారిని రోడ్డుపై అడ్డగించి హీరోయిన్‌ను చితకబాదింది.

View this post on Instagram

A post shared by Ommtv (@bidyadharmadhu)

నా భర్తనే బుట్టలో వేసుకుంటావా? అంటూ ఆగ్రహంతో జుట్టు పట్టుకొని లాగి నెట్టింది. వివరాల్లోకెళితే.. ఒడియా హీరో బబసన్ మోహంతి, హీరోయిన్ ప్రకృతి మిశ్రాలు జంటగా ‘ప్రేమమ్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండడంతో అక్కడ బాగా హిట్టయింది. దీంతో తమిళనాడులోని చెన్నైలో నివసిస్తున్న ఒడిషా వాసులు వీరిద్దరినీ సత్కరించానే ఉద్దేశంతో వారిని పిలిపించారు. ఈ కార్యక్రమానికి వీరిద్దరూ కారులో బయలుదేరారు. అయితే అప్పటికే వీరి మధ్య సంబంధంపై అనమానం పెంచుకున్న హీరో బబుసన్ భార్య తృప్తి.. వీరికి బుద్ధి చెప్పడానికి సమయం కోసం వేచి చూసింది. తాజాగా వారిద్దరూ చెన్నైకి ఒకే కారులో బయలుదేరారని తెలియడంతో రోడ్డుపై కారును అడ్డగించింది. ఆగ్రహంతో కారులోకి ఎక్కి హీరోయిన్‌ జుట్టు పట్టుకుని లాగి కిందికి దింపింది. హీరోయిన్ సాయం కోసం అర్ధిస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. అందరూ వీడియో తీయడంతో బిజీ అయిపోయారు. చివరికి ఎలాగోలా తప్పించుకున్న హీరోయిన్.. అందరికీ దండం పెడుతూ అక్కడనుంచి వెళ్లిపోయింది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Updated : 24 July 2022 2:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top