తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ గురించి అందరికీ పరిచయమే.తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఏం పిల్లో.ఏం పిల్లడో అనే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత బ్రహ్మోత్సవం, రభస వంటి పలు సినిమాలలో నటించినా స్టార్ హీరోయిన్గా గుర్తింపు అయితే దక్కలేదు.
ఇక విషయానికొస్తే.. కర్ణాటకలో మహిళలు భీమన అమావాస్య పర్వదినాన్ని అత్యంత శుభకరమైన రోజుగా భావిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ భీమన అమావాస్యను నేడు (జులై 28) భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తాజాగా, ప్రముఖ నటి ప్రణీత కూడా ఈ పండుగను ఆచరించారు. ఆమె తన భర్త నితిన్ రాజుకు పాదపూజ చేశారు. భర్త నుంచి ఆశీస్సులు అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటో బాగా వైరల్ అవ్వడంతో తన ఫాలోవర్స్ తో పాటు నెటిజన్లు మీరు గ్రేట్ మేడం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రణీతకు కూతురు కూడా పుట్టడంతో ఈ సమయంలో తన కూతురికి, తన ఫ్యామిలీకి బాగా దగ్గరగా తాను ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తుంది.