actress priyamani about divorce with husband mustafa
mictv telugu

విడాకులపై ప్రియమణి ఏం చెప్పిందంటే..

October 26, 2022

అందం, అభినయం రెండు కలగలిపిన నటి ప్రియమణి. 2003లో ‘ఎవరే అతగాడు’ అనే తెలుగు సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి 2007లో తమిళ హీరో కార్తీతో కలిసి ‘పరుత్తివీరన్’ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావటంతో ఒక్కసారిగా ప్రియమణి పేరు సౌత్ అంతా మారు మ్రోగిపోయింది. వరుసగా స్టార్లతో సినిమాలు చేస్తూ అన్ని భాషల్లో క్రేజ్ దక్కించుకుంది. అయితే కెరీర్ కాస్త నెమ్మదించాకా 2017 ఆగస్టులో ఆమె వివాహం చేసుకుంది. విడాకులు తీసుకున్న ముస్తఫా అనే రిచ్ బిజినెస్ మెన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఏ ముహూర్తాన మూడుముళ్లు వేయించుకుందో కానీ అప్పటి నుండి ప్రియమణిపై పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇండస్ట్రీలో మ్యారీడ్ కపుల్స్‌పై పుకార్లు కామన్ అయినా ప్రియమణిపై మాత్రం పెళ్ళైన ఏడాది నుండే విడాకుల కథనాలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రియమణి భర్త ఎక్కువ శాతం విదేశాల్లో ఉండటమే.
ఇక తాజాగా దీపావళికి కొద్దిరోజుల ముందు కూడా భర్తతో ప్రియమణికి గొడవలు జరిగాయని.. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఉండడం లేదని ప్రచారం జరిగింది.

తాజాగా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది ప్రియమణి. పుకార్లు వచ్చినప్పుడు అనవసరంగా స్పందించడం ఎందుకని సైలెంట్‌గా ఉన్నట్లు చెప్పింది. ప్రియమణి దీపావళి వేడుకలను తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. అందులో ముస్తఫా రాజ్ లేరు. ఈ విషయంపై ఆమెని ప్రశ్నించగా.. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారని.. అందుకే ఫ్యామిలీ ఫొటోల్లో కనిపించలేదని వివరించింది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లలో కూడా ముస్తఫాను మిస్ అవుతున్నట్లు ప్రియమణి పేర్కొంది. విడాకుల పుకార్లలో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. త్వరలోనే ఈ వార్తలు కనుమరుగవుతాయని చెప్పింది. ఇక ప్రియమణి ఇచ్చిన ఈ సమాధానంతో విడాకుల పుకార్లలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ వచ్చేసింది.