Actress Radhika made sensational comments on lovers today
mictv telugu

మీలో మగాడు ఉంటే నాకు ఒక్కతే అని చెప్పగలరా – నటి రాధిక సవాల్

November 19, 2022

అలనాటి హీరోయిన్, నటి రాధిక ఈ తరం మగాళ్లకు సవాల్ విసిరారు. మీలో మగాడు ఉంటే నాకు ఒక్కతే లవర్ ఉంది అని ధైర్యంగా చెప్పగలరా? అని ఛాలెంజ్ చేశారు. దీనికి దర్శకుడు అనిల్ రావిపూడి లేచి నేనున్నాను. నాకు ఒక్కతే ఉంది అని బదులిచ్చారు. వెంటనే రాధిక ‘ఒక్కరే భార్య..కానీ ఇద్దరు స్టెపినీలు’ అంటూ కౌంటరివ్వడంతో అందరూ నవ్వేశారు. ఒక్కరే లవర్ ఉన్నారని చెప్తే అది అబద్ధం అని, ఈ కాలంలో కనీసం ఇద్దరు ప్రియురాళ్లను మెయింటేన్ చేస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. తమిళంలో హిట్ అయిన ‘లవ్ టుడే’ సినిమాను అదే పేరుతో తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించగా, హీరో కూడా ఆయనే. హీరోయిన్ గా ఇవానా నటించారు. సత్యరాజ్, రాదిక కీలక పాత్రలు పోషించారు.

ఈ సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన ఆడియో లాంఛ్ కార్యక్రమంలో ముందుగా రాధిక మాట్లాడారు. ‘80ల కాలంలో శోభన్ బాబు, కృష్ణ వంటి హీరోల సినిమాల్లో హీరోలకు ఇద్దరు భార్యలుండేవారు. ఇద్దరు కూడా తమ భర్త బాగుండాలని పూజలు చేసేవారు. కానీ, ఇప్పుడు అదంతా అబద్ధమైపోయింది. ఇప్పుడు ప్రతీ ఒక్కరు స్టెపినీని మెయింటైన్ చేస్తున్నారు. అబ్బాయి అంతే, అమ్మాయి అంతే. అమ్మాయిలు అయితే కాఫీకి ఒకరిని, సాయంత్రం డ్రాప్ చేయడానికి మరొకరిని మెయింటైన్ చేస్తున్నారు. ఈ కాలం ప్రేమలు ఇలాగే ఉన్నాయి. సరిగ్గా ఈ పాయింట్‌ని పట్టుకుని దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని నమ్మకంతో చెప్తున్నా. మహేశ్ బాబు, చిరంజీవి, ప్రభాస్‌లను అభిమానించే తెలుగు వారు ఇక నుంచి ప్రదీప్‌ని కూడా అభిమానిస్తారు. ఎందుకంటే కంటెంటే కింగ్. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు తమ ఫోన్లు మార్చుకుంటారు. దీంతో గొడవ మొదలవుతుంది. అందులోంచే ఫన్ పుడుతుంది. అందుకే నిజ జీవితంలో ఎవరూ తమ ఫోన్‌‌ని ఇతరులకు ఇవ్వరు’ అంటూ మాట్లాడారు. నవంబర్ 4న తమిళంలో రిలీజై మంచి హిట్ కొట్టిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందని రాధిక, దిల్ రాజు, అనిల్ రావిపూడి మిగతా యూనిట్ సభ్యులు నమ్మకంగా చెప్పారు.