జైల్లో పడిపోయిన నటి రాగిణి.. ఆస్పత్రిలో చేర్చాలని పిటిషన్ - MicTv.in - Telugu News
mictv telugu

జైల్లో పడిపోయిన నటి రాగిణి.. ఆస్పత్రిలో చేర్చాలని పిటిషన్

October 13, 2020

mnghmnghm

కన్నడ నటి రాగిణి గాయాలపాలయ్యారు. జైలులో జారిపడటంతో నడుము, వెన్నెముకకు గాయమైంది. దీంతో తనను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. దీంతో ఆమె పిటిషన్‌పై అభ్యంతరాలు చెప్పాలంటూ న్యాయస్థానం సీసీబీ పోలీసులకు సూచించింది.   

శాండల్‌వుడ్ డ్రగ్ కేసులో రాగిణి కొన్ని రోజుల క్రితం అరెస్టు అయింది. ఆమెకు ఈ నెల 23 వరకు రిమాండ్ విధించారు. అప్పటి నుంచి అక్కడే ఉన్న ఆమె ఇటీవల జారిపడింది. అప్పటి నుంచి జైల్లోనే అధికారులు చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ  తనకు ఎలాంటి ఉపశమనమూ లభించలేదని ఆమె తెలిపింది. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకునే అవకాశం కల్పించాల్సిందిగా కోరింది.