actress rakhi sawant arrested over sherlyn chopra complaint
mictv telugu

శుభవార్త తెలిసింది…అంతలోనే అరెస్ట్ అయింది

January 19, 2023

actress rakhi sawant arrested over sherlyn chopra complaint

బాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ రాఖీ సావంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాం నిన్ననే తను ప్రగ్నెంట్ అన్న శుభవార్త తెలిసింది అంతలోనే అరెస్ట్ అయి కూర్చుంది. పైగా బెయిల్ కూడా దక్కలేదు. రాఖీ సావంత్ అరెస్ట్ విషయాన్ని మరో బాలీవుడ్ నటి షెర్లీన్ చోప్రా సోష్ మీడియాలో పోస్ట్ చేసింది. అసలు ఆమె కంప్లైంట్ మీదనే పోలీసులు రాఖీని అరెస్ట్ కూడా చేశారు. తమ మీద అభ్యంతరక్ర భాష వాడినందుకు గానూ షెర్లీన్ కేసు పెట్టింది. ముందస్తు యెయిల్ కోసం అప్లై చేసినప్పటికీ ముంబై కోర్టు దానిని తిరస్కరించింది.

కొన్ని రోజుల క్రితం రాఖీ సావంత్ , షెర్లీన్ చోప్పా మధ్య గొడవ జరిగింది. సోషల్ మీడియాలోనే ఒకరినొకరు తిట్టుకున్నారు. మీటూ వివాదంలో బాలీవుడ్ నటుడు సాజిద్ ఖాన్ మీద షెర్లీన్ సంచలన వ్యాఖ్యలు చేయగా రాఖీ అతనికి మద్దతుగా నిలిచింది. ఈ క్రమంలో రాఖీ షోర్లీన్ అభ్యంతరకర పదాలను వాడింది. దీంతో ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు.

షెర్లీన్ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో వాడారనే ఆరోపణల మీద రాఖీని అరెస్ట్ చేశామని ముంబై పోలీసులు చెబుతున్నారు. తనపై ఐపీసీలో 354ఏ, 509, 504 తో పాటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చటంటలోని సంబంధిత నింబధనల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. కొన్నాళ్ళ క్రితమే ప్రియుడు ఆదిల్ ఖాన్ ను సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్న రాఖీ సావంత్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న వార్త కూడా చక్కర్లు కొడుతోంది.