బోల్డ్ బ్యూటీ రాఖీసావంత్ శనివారం లలిత్ మోదీ – సుస్మితా సేన్ వ్యవహారంపై మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియానే మొదట ఆమెను ఈ వ్యవహారంపై స్పందించమని కోరగా, లలిత్ మోదీ ఎవరని ప్రశ్నించింది. దాంతో ఐపీఎల్ సృష్టికర్త అని చెప్పగా వారిని చూస్తే తండ్రీ కూతుళ్లలా ఉన్నారని పేర్కొంది. అయినా ప్రపంచ సుందరిని దక్కించుకున్న లలిత్ మోదీ జాక్ పాట్ కొట్టాడని చెప్పింది. తర్వాత మనీ లాండరింగ్ చేసి విదేశాలకు పారిపోయాడని చెప్పగా, ‘అమ్మాయిలకు కావాల్సింది ఇలాంటి వారే. వారు రంగు, రూపు చూడరు, కేవలం డబ్బుందా లేదా అనేదే చూస్తారు. డబ్బుతో పారిపోయిన వాళ్ల వెనకాల పడతారు. కానీ, నేను అలా కాదు. నిజమైన ప్రేమ వెంట పడతాను’ అని కామెంట్ చేసింది. మళ్లీ ‘ఇలా డబ్బు తీసుకొని పారిపోయిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోరు. విజయ్ మాల్యా కూడా విలాసంగా జీవిస్తున్నాడు’ అని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.