నా ఇల్లు గిఫ్ట్ అని ఎవరు మీతో చెప్పింది..రకుల్‌ ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

నా ఇల్లు గిఫ్ట్ అని ఎవరు మీతో చెప్పింది..రకుల్‌ ఫైర్

December 2, 2019

నటీనటులపై మీడియాలో రూమర్స్ రావడం సహజమే. అలా వస్తున్న రూమర్స్‌ను నటీనటులు పెద్దగా పట్టించుకోరు. కానీ, కొన్నిసార్లు మీడియా రూమర్స్ హద్దులు మీరుతాయి. అలాంటప్పుడు ఘాటుగా స్పందిస్తారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌పై మీడియాలో తప్పుడు వార్తలు వచ్చాయి. దీంతో ఆమెపై వస్తున్న వార్తలపై ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు.  

తన గురించి నిజమైన వార్తలను మాత్రమే ప్రచారం చేయండి అంటూ పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్‌కు వీడి బెంగళూరుకు మారిపోయారని పుకార్లు షికార్లు చేసాయి. అందుకే రకుల్ హైదరాబాద్‌లో తన ఇంటిని తక్కువ ధరకే అమ్మేసిందనే వార్తలు వచ్చాయి. అంతేకాదు బెంగళూరులో అందమైన ఇంటిని కొనుగోలు చేశారంటూ వార్తలు వెలుబడ్డాయి. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ లో స్పందించారు. నాపై వస్తున్న వార్తలన్ని అవాస్తవాలని తెలిపారు. హైదరాబాద్‌లో రకుల్ ఉంటున్న ఇంటిని ఎవరో తనకు గిఫ్ట్‌గా ఇచ్చారని రాసారని… దయచేసి ఇలాంటి వార్తలను రాయకండి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం రకుల్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బిజీగా ఉన్నారు. నటిగా ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. అయినా కూడా ఆమెపై తప్పుడు వార్తలు రావడం ఆమెను కలచివేసింది.