మీకు కాళ్లూ చేతులు లేవా?..నెటిజన్ కు రష్మీ కౌంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

మీకు కాళ్లూ చేతులు లేవా?..నెటిజన్ కు రష్మీ కౌంటర్

April 7, 2020

లాక్‌డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవ్వరూ బయటికి రావడం లేదు. దీంతో మూగ జీవుల గురించి పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు. దీంతో తినడానికి తిండి లేక వీధి కుక్కలు ఆకలితో అలమటిస్తున్నాయి.

 

వీధి కుక్కల దుస్థితి చూసి యాంకర్ రష్మీ చలించిపోయారు. స్వయంగా ఆహారం తయారు చేసి కొన్ని వీధి కుక్కలకు అందించారు. అందరూ సమీపంలో ఉన్న మూగ జీవాలకు ఆహారం అందించాలని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. రష్మీ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే, ఓ తుంటరి మాత్రం ‘రోడ్డుపై ఉన్న కుక్కలకు ఆహారం పెడుతున్నావ్ మంచిదే.. మా ఇంటి పైన ఓ కుక్క ఉంది దానికి కూడా పెడతావా.. ఊరికే అది నా ఇంటర్నెట్ కేబుల్ తింటుంది’ రష్మీ చేసిన ట్వీట్ కు బదులిచ్చాడు. దీంతో రష్మీకి కోపం వచ్చింది. ‘మీకు కాళ్లు చేతులు లేవా.. కొంచెం రైస్ పెడితే మీ ఆస్తి మొత్తం పోతుందా.. మీకంటే పేదవాళ్లు వెయ్యి రెట్లు బెటర్.. వాళ్లు తినే ఒక రోటీలో కూడా సగం పక్షులకు పెడతారు.. మీరేమో ఇంటర్నెట్ కేబుల్ గురించి టెన్షన్ పడుతున్నారు’ అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.