స్టార్ హీరోయిన్ సమంతకు మయోసైటిస్ వ్యాధి సోకిందని తెలియగానే యావత్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆమె త్వరగా కోలుకోవాలని సినీ తారలతో పాటు పలువురు ప్రముఖులు ప్రార్థనలు చేశారు. సామ్‌కి ధైర్యాన్నిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు షేర్ చేశారు. ఈ నేపథ్యంలో సామ్ ఆరోగ్య పరిస్థితిపై మరో ప్రముఖ నటి, నేషనల్ క్రష్ రష్మిక మందన్నసైతం తాజాగా స్పందించింది. ఆమె తన తాజా చిత్రం వారిసు (వారసుడు) ప్రమోషన్లలో సామ్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. అయితే తాను మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించే వరకు తనకు ఆ విషయం తెలియదని చెప్పింది రష్మిక.
‘సమంత అద్భుతమైన మహిళ. ఆమె చాలా దయగల, అందమైన వ్యక్తి. నేనెప్పుడూ ఆమెని తల్లిలా చూసుకోవాలను కుంటున్నాను. తన ఆరోగ్యంపై సమంత ప్రకటించిన తర్వాతనే నాకు మైయోసైటిస్ గురించి కూడా తెలిసింది. ఎందుకంటే తానూ ఇంతకు ముందు ఎప్పుడూ దాని గురించి మాట్లాడలేదు. ఏది ఏమైనా ఆమెకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సామ్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లను ఎదుర్కొంది. చాలా మందిలాగే నేను కూడా ఆమె నుంచి స్ఫూర్తి పొందుతాను’ అని రష్మిక అన్నారు.
ఇక ‘ఆమెకు అమ్మగా మారి కాపాడుకోవాలని ఉంది’ అంటూ రష్మిక చేసిన కామెంట్స్ పలువురిని కదిలిస్తున్నాయి. రష్మిక పోస్టు కంటే సామ్ త్వరగా కోలుకోవాలనే ఎక్కువగాఫ్యాన్స్ మెసేజిలు పెడుతున్నారు.