actress rashmika emotional note on hate trolling
mictv telugu

ప్లీజ్ నన్ను వేధించొద్దు.. రష్మిక కన్నీటి లేఖ

November 9, 2022

సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు గాసిప్స్ బెడద సహజమే. కాస్త ఛాన్స్ దొరికితే అసత్య కథనాలు వడ్డించేస్తారు. బ్రాడ్ బాలీవుడ్ లో ఈ రూమర్స్ ని పబ్లిసిటీగా వాడుకుంటారు. కానీ సౌత్ లో మాత్రం గాసిప్స్ ని కాస్త సీరియస్ గా పరిగణిస్తారు. వారిపై వచ్చే ప్రచారాలకి హార్ట్ అవుతుంటారు.వెంటనే నెగిటీవ్ కథనానలకు వివరణో, లేదా ఖండనో చేస్తారో. చాలాకొద్ది మంది మాత్రమే తాడూబొంగరం లేని వార్తలంటూ కొట్టిపారేస్తారు. కానీ హీరోయిన్ రష్మిక మాత్రం తనపై వచ్చే రూమర్స్ ని వేధింపులుగా పరిగణిస్తుంది. ఇకనైనా అసత్య కథనాలతో తనని వేధించొద్దంటూ వేడుకుంటుంది. ఎప్పుడు లేనంతగా ఎమోషనల్ అవుతూ.. నెగిటీవ్ వార్తలని ఆపాలని సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టింది. నెగిటివ్ ప్రచారం తన హృదయాన్ని ఎంతగానో గాయపరుస్తున్నాయని తన మనసులోని బాధను సుధీర్ఘ నోట్ ద్వారా అభిమానులతో పంచుకుంది హీరోయిన్ రష్మిక.

 

రష్మిక మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేయడం.. నాపై నెగిటివిటిని వ్యాప్తి చేయడం హృదయాన్ని బాధిస్తుంది. అవి నన్ను నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యంగా కొన్ని ఇంటర్వ్యూలలో నేను చెప్పని విషయాలు నాకు వ్యతిరేకంగా మారుతున్నాయి. నాకు.. ఇండస్ట్రీలో.. బయట ఉన్న సంబంధాలు..నాకు వ్యతిరేకంగా అనేక కథనాలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. ఇప్పుడు వాటిని పరిష్కరించే సమయం వచ్చిందనుకుంటున్నాను. కానీ నాపై ఇంత నీచమైన నెగిటివిటి.. ద్వేషం ఎందుకు ?.. చాలా రోజులుగా ఈ కథనాలను వదిలేశాను. ఇక సహించను. అయితే మీలో చాలామంది నన్ను మనసారా ప్రేమిస్తారు. ఆ ధైర్యంతోనే నేను ఈ పోస్ట్ పెడుతున్నాను. మిమ్మల్ని అలరించేందుకు మరింత కష్టపడతాను. మీ సంతోషం.. నాకు సంతోషాన్నిస్తుంది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను.. ధన్యవాదాలు ” అంటూ రష్మిక పెట్టిన ఎమోషనల్ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ నోట్ ఏ రూమర్ ని ఉద్దేశించి రాసిందో రష్మిక క్లారిటీ ఇవ్వలేదు. బహుశా రౌడీ విజయదేవరకొండతో ప్రేమ, పెళ్లి వంటి వార్తలని ఉద్దేశించే రష్మిక ఈ పోస్ట్ చేసిందని అంటున్నారు.