సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది నేషనల్ క్రష్ రష్మిక. కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బాలీవుడ్ లో దూసుకెళ్తుంది. అయితే తనకి జీవితాన్నిచ్చిన కిరిక్ పార్టీ దర్శకుడు కాంతార హీరో రిషబ్ శెట్టి, హీరో రక్షిత్ శెట్టిలను గౌరవంచటం లేదని చాలా రోజులుగా రష్మికపై విమర్శలు వస్తున్నాయి. కొద్దిరోజులకు అవి మరింత పెరిగి.. కన్నడ ప్రజలను కూడా రష్మిక అవమానిస్తుందంటూ ప్రచారం జరిగింది. కన్నడ పరిశ్రమ నుండి రష్మికని బహిష్కరిస్తారని కూడా రూమర్స్ వచ్చాయి. అయితే ఈ వివాదానికి ఇప్పుడు రష్మిక ఎట్టకేలకు ఎండ్ కార్డు వేసింది. తనకి ఇంత నెగిటివిటీ రావడానికి కారణమైన రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిల అభిమానులని కూల్ చేసే ప్రయత్నం చేసింది. అయితే విమర్శలు వస్తున్న ఇన్నాళ్లకు దిగొచ్చి రిషబ్, రక్షిత్ లపై ప్రశంసలు కురిపించింది రష్మిక. తానూ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి వీరిద్దరే కారణమని చెప్పింది.
ఒక తెలుగు విలేఖరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ” రక్షిత్, రిషబ్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. వాళ్లిద్దరూ లేకపోతే నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టేదాన్ని కాదు. ఎప్పటికి నేను వాళ్ళిద్దరికీ రుణపడి ఉంటాను” అంటూ కామెంట్స్ చేసింది. ఇక తనపై వస్తున్న ట్రోల్స్ పై కూడా విరుచుకుపడింది రష్మిక. ” నేను అస్సలు ట్రోల్స్ ని పట్టించుకోను. చాలా సైలెంట్, నా పనేదో నేను చేసుకుంటా. కానీ ఇప్పుడు అందరు హద్దులు దాటుతున్నారు. నా తల్లిని, చెల్లిని కూడా బండ బూతులు తిడుతున్నారు. వారేం పాపం చేశారు. ఇప్పుడు నా తల్లి, చెల్లిలా మానసిక ప్రశాంతతని కాపాడటం నా ప్రధాన కర్తవ్యం’ అని కామెంట్స్ చేసింది రష్మిక. ఇక ఇన్నాళ్లు తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోని రష్మిక.. ఇప్పుడు తనని ఎక్కడ బహిష్కరిస్తారో అని భయంతో దొగొచ్చిందని కన్నడ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఆమె కెరీర్ కోసమే రిషబ్, రక్షిత్ లని కాకా పడుతుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.