Actress Rashmika Mandanna Stops Her Bodyguard From Manhandling A Fan, Video Goes Viral
mictv telugu

ఫ్యాన్స్‌ హార్ట్‌ గెలుచుకున్న రష్మిక… దూసుకొచ్చిన అభిమానితో

June 14, 2022

Actress Rashmika Mandanna Stops Her Bodyguard From Manhandling A Fan, Video Goes Viral

‘పుష్ప’ సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక.. ప్రస్తుతం ఎంతోమందికి హాట్ ఫేవరేట్. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న కన్నడ బ్యూటీకి అటు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేం కాదు. అయితే రష్మిక కూడా అంతే.. ఎప్పడూ తన ఫ్యాన్స్‌ను హర్ట్ చేయదు. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచింది. తనని చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌తో రష్మిక వ్యవహరించిన తీరు అందరితో చప్పట్లు కొట్టేలా చేయిస్తోంది. రష్మికతో ఫొటో తీయించుకునేందుకు వస్తున్న అభిమానిని ఆమె బౌన్సర్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో రష్మిక కల్పించుకొని అతడిని వదలమని చెప్పి, ఫ్యాన్‌తో ఫొటోకు ఫోజిచ్చారు. ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న రష్మిక.. చిత్రీకరణ పూర్తయిన తర్వాత క్యారవ్యానులోకి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

దీంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ రష్మికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘చాలా స్వీట్’, ‘దక్షిణాది నటులు చాలా ఒద్దికగా ఉంటారు. బాలీవుడ్ నటులలాగా కాదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌తో పుష్ప సెకండ్ పార్ట్, తమిళంలో విజయ్‌తో ఓ సినిమా, బాలీవుడ్‌లో మిస్టర్ మజ్ను, యానిమల్, అలాగే మరికొన్ని సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది.