బాలీవుడ్ కోల్పోయింది ఇదీ : రవీనా టాండన్ - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్ కోల్పోయింది ఇదీ : రవీనా టాండన్

April 19, 2022

resave
బాహుబలి, కేజీఎఫ్ వంటి సిరీస్‌లు, ఆర్ఆర్ఆర్ వంటి భారీ మల్టీ స్టారర్ సినిమాలు హిందీలోనూ భారీ స్థాయిలో వసూళ్లు సాధించడంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు మెచ్చుకున్నారు. ఈ లిస్టులో మాజీ హీరోయిన్ రవీనా టాండన్ కూడా చేరిపోయింది. కేజీఎఫ్ 2 లో ప్రధాన మంత్రి పాత్ర పోషించిన రవీనా.. దక్షిణాదితో పోలిస్తే బాలీవుడ్ ఎందులో వెనకబడిపోయిందో కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పింది. దక్షిణాది సినిమాలు భారత సంస్కృతీ, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను అట్టిపెట్టుకుని సినిమాలలో వాటిని నిండుగా చూపిస్తుంటే.. బాలీవుడ్ మాత్రం హాలీవుడ్‌ని అనుకరిస్తూ ప్రేక్షకులకు దూరమైందని విశ్లేషించింది. అలాగే కేజీఎఫ్‌ యాక్షన్ సినిమా అని అంటున్నారని, ఫైట్లు, బుల్లెట్లు ఉన్నా కూడా ఆ సినిమాలో ఎమోషనల్ ఎలిమెంట్లే హైలెట్ అని తేల్చి చెప్పింది. ఎమోషన్ లేకపోతే ఏ సినిమా అయినా అంత పెద్ద హిట్ అవ్వదని పేర్కొంది. అంతేకాక, తాను హీరోయిన్‌గా నటిస్తున్న సమయంలో కూడా బాలీవుడ్ తన ఒరిజినాలిటీని వదిలేసి హాలీవుడ్‌ని అనుకరించడంలో బిజీగా ఉండేదని, అందుకని తాను దక్షిణాది సినిమాలలో నటించానని తెలియజేసింది. అప్పటినుంచి సౌత్ చిత్రాలలో సాధారణ ప్రేక్షకుడికి ఏం కావాలో అది అందించడం  గమనించానని వెల్లడించింది.

010