Actress Regina expressed her impatience with the reporter
mictv telugu

ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? – రిపోర్టర్‌పై నటి రెజీనా అసహనం

September 6, 2022

హీరోయిన్ కం నటి రెజీనా కాసాండ్రా, మరో నటి నివేదా థామస్‌లు కలిసి నటించిన తాజా చిత్రం శాకిని ఢాకిని. ఈ నెల 16న విడుదల అవుతున్న ఈ చిత్రం కొరియన్ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’కు అధికారిక రీమేక్. సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్‌లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్బంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై నటి రెజీనా అసహనం వ్యక్తం చేసింది. ‘ఈ సినిమాలో మీ పాత్రకు ఓసీడీ సమస్య ఉంది. నిజ జీవితంలో కూడా మీకు ఇలాంటి సమస్య ఏమైనా ఉందా? అని అడుగగా, రెజీనా ఒక్కసారిగా ఫైర్ అయ్యింది. ‘ఈ సినిమాలో అమ్మాయిల గురించి చాలా గొప్పగా చూపించాం. అది వదిలేసి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? నాకు ఓసీడీ లేదు. అమ్మాయిలు సాధారణంగానే చాలా పరిశుభ్రంగా ఉంటార’ని ధీటుగా సమాధానమిచ్చింది. ఇంకా మాట్లాడుతూ ‘ఈ సినిమాలో యాక్షన్ కామెడీతో పాటు మంచి సందేశం ఉంది. కదిలే కదిలే పాటు చూసిన తర్వాత నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అంత అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా మహిళలు ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది. తప్పకుండా అందరూ సినిమాను థియేటర్లో చూడాలి’ అని చెప్పారు.