actress Regina played dirty jokes on boys
mictv telugu

అబ్బాయిలు, మ్యాగీ రెండూ రెండు నిమిషాలే.. నటి రెజీనా బోల్డ్ కామెంట్స్

September 10, 2022

actress Regina played dirty jokes on boys

హీరోయిన్, నటి రెజీనా కాసాండ్రా మరో హీరోయిన్‌ నివేదా థామస్‌తో కలిసి నటించిన తాజా చిత్రం శాకిని ఢాకిని. కొరియన్ సినిమాకు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం ఈ నెల 16న విడుదలవుతోంది. దీంతో సినిమా ప్రమోషన్లను విరివిగా చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఓ ఫుడ్ యూట్యూబ్ చానెల్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా నటి రెజీనా అబ్బాయిల గురించి బోల్డ్ కామెంట్ చేశారు. ‘అబ్బాయిల మీద నా దగ్గర ఓ పెద్ద జోక్ ఉంది. కానీ ఇక్కడ వేయకూడదు’ అని యాంకర్‌తో అనగా ‘అబ్బాయిల మీద వద్దు నాపై చెప్పండి’ అని యాంకర్ అంటాడు. దానికి రెజీనా ‘అబ్బాయిలు, మ్యాగీ రెండూ రెండు నిమిషాల్లో అయిపోతాయి. మీకు అర్ధం కావడం లేదు’ అనగానే యాంకర్ ‘నాకు అర్ధమైంది’ అంటాడు. వెంటనే రెజీనా ‘ఇంకొద్దు’ అంటుంది. ఈ సంభాషణను పక్కనే ఉన్న నివేదా థామస్ ఏమాత్రం పట్టించుకోకుండా తన పనిలో తాను ఉంది. అయితే నెటిజన్లు రెజీనా కామెంట్లను ట్రోల్ చేస్తున్నారు. అబ్బాయిల సెక్స్ సామర్ధ్యం గురించి నీ దగ్గర ఇలాంటి జోక్‌లే ఉన్నాయా? అంటూ మండిపడుతున్నారు. కొందరేమో అది సెక్స్ సామర్ధ్యం గురించి కాదు, అమ్మాయిని చూసి ప్రేమలో పడడానికి పట్టే సమయమంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, రెజీనా 2020 వరకు ఓ హీరోని ప్రేమించింది. కానీ, తర్వాత బ్రేకప్ అవడంతో అప్పట్నుంచి ప్రేమ మీద నమ్మకం పోయిందనీ, ఇంకెప్పుడూ అలాంటి పనుల జోలికి వెళ్లనని చెప్తోంది.