నటి రేఖ సెక్యూరిటీ గార్డ్‌కి కరోనా పాజిటివ్..బంగ్లా సీల్ - MicTv.in - Telugu News
mictv telugu

నటి రేఖ సెక్యూరిటీ గార్డ్‌కి కరోనా పాజిటివ్..బంగ్లా సీల్

July 12, 2020

nbvbnj

హిందీ పరిశ్రమలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎందరో బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెల్సిందే. తాజాగా అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లకు కూడా కరోనా వైరస్ సోకింది. అలాగే ప్రముఖ నటి రేఖ ఉంటున్న బంగ్లాలోని సెక్యూరిటీ గార్డ్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. 

దీంతో ఆమె బంగ్లాని బీఎంసీ అధికారులు సీల్ చేశారు. భవనం వెలుపలు కంటైన్‌మెంట్ జోన్‌గా నోటీసు అంటిచారు. రేఖా బంగ్లా ముంబైలోని బాంద్రాలోని బ్యాండ్‌స్టాండ్ ప్రాంతంలో ఉంది. దీనికి సీ స్ప్రింగ్స్ అని పేరు పెట్టారు. ఈ ఇంటికి కాపలాగా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఎప్పుడూ ఉంటారు. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మిగతా సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.