కోట్ల రూపాయలు మోసపోయిన చిరంజీవి హీరోయిన్ - MicTv.in - Telugu News
mictv telugu

కోట్ల రూపాయలు మోసపోయిన చిరంజీవి హీరోయిన్

March 31, 2022

bbb

మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘అందరివాడు’లో హీరోయిన్‌గా నటించిన సినీ హీరోయిన్ రిమ్మీసేన్ గుర్తుందా?. బాలీవుడ్ హాస్య చిత్రాల్లో ఎక్కువగా కనిపించే ఈ నటి కోట్ల రూపాయలు మోసపోయింది. గోరేగావ్‌కు చెందిన వ్యాపారవేత్త రౌనక్ జతిన్ వ్యాస్ తనను రూ. 4.14 కోట్లు మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడేళ్ల క్రితం జిమ్‌లో పరిచయమైన జతిన్ తానొక వ్యాపారవేత్తగా చెప్పుకొన్నాడని తెలిపింది. ఈ క్రమంలో స్నేహితులమయ్యామని, అతడిని నమ్మి ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో పెట్టుబడి పెట్టానని ఫిర్యాదులో పేర్కొంది. కొన్ని రోజులకు అతని జాడ లేకపోవడంతో విచారించగా.. జతిన్ అసలు ఎలాంటి కంపెనీ ప్రారంభించలేదని తెలిసి ఖంగుతిన్నానని వివరించింది. కాగా, రిమ్మీసేన్ ఫిర్యాదును అందుకున్న పోలీసులు జతిన్ వ్యాస్‌పై ఐపీసీ సెక్షన్లు 420, 409 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. నిందితుడు జతిన్ కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.