ఇటీవల విడుదలై కలెక్షన్లలో దూసుకుపోతున్న మహేశ్ బాబు సినిమా సర్కారు వారి పాట నాలుగు రోజుల్లో వంద కోట్లను క్రాస్ చేసింది. మొత్తం 133 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో కొన్ని ఏరియాల్లో రికార్డుల దిశగా పయనిస్తోంది. అంతేకాక, అమెరికాలో 2 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది ఈ చిత్రం. బ్యాంకింగ్ మోసాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మహేశ్ ఫైట్లు, డ్యాన్సులతో మంచి ఆదరణ దక్కించుకొంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాను సెలెబ్రెటీలు సైతం థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు. తన నటనతో తెలుగునాట మంచి పేరు తెచ్చుకున్న సాయిపల్లవి ఆదివారం ఓ మల్టీపెక్స్‌లో సర్కారు వారి పాటు సినిమాను సీక్రెట్‌గా చూసింది. ఎవరికీ అనుమానం రాకుండా ముఖం కప్పుకొని వెళ్లింది. అయితే బయటికి వచ్చేటప్పుడు కెమెరా కంటికి చిక్కడంతో ఈ విషయం బయటపడింది. అయితే ఇలా వెళ్లడం సాయిపల్లవికి ఇదే మొదటిసారి కాదు. గతంలో పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ సినిమాకు కూడా ఇలాగే వెళ్లి చూసింది. కాగా, పలు సందర్భాల్లో మహేశ్ బాబు తన అభిమాన హీరో అని సాయిపల్లవి చెప్పుకొచ్చింది.
Yesterday @Sai_Pallavi92 mam Watched #SarkaruVaariPaata movie at PVR RK Cineplex (Hyderabad) 😃♥#SaiPallavi pic.twitter.com/e94wnk2OpM
— Sai Pallavi™ (@SaipallaviFC) May 15, 2022