ఐటెం సాంగులపై సాయి పల్లవి.. సమంత, పూజాలకు చెంపపెట్టు! - MicTv.in - Telugu News
mictv telugu

ఐటెం సాంగులపై సాయి పల్లవి.. సమంత, పూజాలకు చెంపపెట్టు!

May 23, 2022

కేవలం తన పెర్‌ఫార్మెన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటి సాయి పల్లవిని ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. టాలెంటెడ్ నటిగా, ఇంతవరకు స్కిన్ షో చేయకుండా నచ్చిన పాత్రలను చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక అభిమాన గణాన్ని సాధించుకున్నారు. మిగతా హీరోయిన్లు చేస్తున్నట్టు గ్లామర్, ఎక్స్ పోజింగ్‌లకు దూరంగా ఉంటూ వచ్చింది. కేవలం తన నటన ద్వారా మాత్రమే గుర్తింపు పొంది, అదే ఆయుధంగా సినిమాల అవకాశాలను పొందగలుగుతోంది.

తాజాగా ఐటెంసాంగులపై సాయి పల్లవి తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్టు మరోసారి వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ‘పుష్ప చిత్రంలోని సమంత ఐటెం సాంగు, రంగస్థలంలోని పూజా హెగ్డే జిగేలు రాణి వంటి పాటలలో నర్తించే అవకాశం వస్తే చేస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సాయిపల్లవి తనదైన శైలిలో సమాధానమిచ్చింది. ‘ఖచ్చితంగా చేయను. ఐటెం సాంగులు నాకు కంఫర్ట్‌గా ఉండవు. వస్త్రధారణ సరిగ్గా లేకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి పాటలు చేయాలనే ఆసక్తి కూడా నాకు లేదు. ఎవరైనా ఆఫర్ చేస్తే చచ్చినా చేయనని చెప్పేస్తా’నని సూటిగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. సాయి పల్లవి అభిప్రాయాలను విన్న సాంప్రదాయవాదులు ఆమెను మెచ్చుకుంటున్నారు. నటన అంటే గ్లామర్, స్కిన్ షోలు చేయడం కాదని, ఈ విషయంలో మిగతా హీరోయిన్లు సాయిపల్లవిని చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు.