actress saipallavi talking in virataparwam success meet
mictv telugu

అన్నయ్య రావడంతో హ్యాపీగా ఉంది : సాయిపల్లవి

June 18, 2022

actress saipallavi talking in virataparwam success meet

రానా, సాయి పల్లవి నటించిన తాజా చిత్రం ‘విరాటపర్వం’ జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. తూము సరళ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. చిత్రం విజయం సాధించడంతో సినిమా బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తూము సరళ అన్నయ్య తూము మోహన్ రావు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ.. ‘తూము సరళ ఇంటికి వెళ్లినప్పుడు వారు బొట్టుపెట్టి, చీర పెట్టి దీవించారు. ఆ కుటుంబాన్ని చూసిన తర్వాత కన్నీళ్లు వచ్చాయి. గొప్ప మనసున్న వాళ్లు మళ్లీ పుడతారు. వారు చేయాలనుకున్నది ఇంకో మార్గంలో సాధించుకుంటారు. ఈ కార్యక్రమానికి తూము మోహన్ రావు కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. వెన్నెల పాత్ర పోషించినందుకు గర్వంగా భావిస్తున్నా. సినిమాను మళ్లీ మళ్లీ చూసి, ఇంకా గొప్పగా ఫీలవుతున్నామని ప్రేక్షకులు చెప్తుంటే ఆనందం హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు’ అని వ్యాఖ్యానించింది.