నేను వేయించుకున్నా.. మీరలా చేయకండి : సమంత - MicTv.in - Telugu News
mictv telugu

నేను వేయించుకున్నా.. మీరలా చేయకండి : సమంత

April 18, 2022

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఇటీవల అభిమానులతో చిన్న చిట్ చాట్ నిర్వహించింది. పలు ప్రశ్నలకు నిజాయితీతో కూడిన సమాధానాలిచ్చింది. తాను మొదటగా చూసిన సినిమా జురాసిక్ పార్క్, తొలి సంపాదన రూ. 500 అంటూ ఆయా ప్రశ్నలకు జవాబిచ్చింది. టాటూల గురించి స్పందిస్తూ.. ‘మొదట టాటూలు వేయించుకోకూడదని అనుకున్నా. కానీ, తర్వాత వేయించుకున్నా. మీరెవ్వరూ వాటి జోలికి వెళ్లకండి. అలాంటి ఆలోచన ఉంటే మానుకోండి. నాలా ఇబ్బంది పడకండి’ అంటూ హితబోధ చేసింది. కాగా, సమంత నడుము పైభాగంలో తన మాజీ భర్త నాగచైతన్య పేరును సూచించేలా ‘చై’ అనే టాటూ వేయించుకుంది. వీపు, కుడిచేతిపై మరో రెండు టాటూలు ఉన్నాయి. తన భర్తతో కలిసి ఉన్నప్పుడు ప్రేమతో ఆయన పేరును పెట్టుకుంది. ఇప్పుడు విడిపోయాక ఆ టాటూ తీయడం కుదరడం లేదు. అందుకే సమంత అలా బాధపడుతుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చివరగా అందరం స్వశక్తిపై ఆధారపడాలని, దాంతో తమ కలలను సాకారం చేసుకోవాలని సూచించింది.