నల్లమలపై రాష్ట్రపతికి సమంత ఫిర్యాదు  - MicTv.in - Telugu News
mictv telugu

నల్లమలపై రాష్ట్రపతికి సమంత ఫిర్యాదు 

September 13, 2019

తెలుగు ప్రజల ఊపిరితిత్తులు న‌ల్ల‌మ‌ల అడ‌వుల‌ కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు గళం విప్పుతున్నారు. సినీతారలు, దర్శకులు, ఆయా రంగాల్లోని ప్రముఖు పోస్టర్లు పట్టుకుని మళ్లీ ప్రచారం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, పవన్ కల్యాణ్, శేఖర్ కమ్ముల, అనసూయ తదితరులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. యురేనియాన్ని కొనొచ్చు, అడవులను కొనగలమా అని ప్రశ్నిస్తున్నారు. టాప్ హీరోయిన్ సమంత కూడా వీరితో జత కలసింది. ఏకంగా భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది. 

యురేనియం తవ్వకాలను ఆపి నల్లమల అడవులను కాపాడాలని ఆమె రాష్ట్రపతిని కోరుతూ ట్వీట్ చేసింది. యురేనియం తవ్వకాలకకు వ్యతిరేకంగా తాను సంతకం చేశానని, మీ సంగతి ఏంటని అభిమానులను  ప్ర‌శ్నించింది. వామపక్ష విద్యార్థి సంస్థ డీవైఎఫ్ఐ రూపొందించిన పోస్టర్‌ను కూడా జతచేసింది. ఆమ్రాబాద్ ప్రాంతంలోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపడానికి కేంద్రం యత్నిస్తున్న సంగతి తెలిసిందే.