నాగచైతన్యతో విడిపోయిన తర్వాత గ్లామర్ డోస్ పెంచిన సమంత పుష్ప సినిమాలోని ఐటెం సాంగుతో ఉత్తరాది ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యింది. అవార్డు ఫంక్షన్లలో హాట్ డ్రెస్సులతో కుర్రకారు మతులు పోగొడుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమెను అనుసరించే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. సమంతకు ఇన్స్టాగ్రాంలో రెండు కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
దీంతో సమంత ఏం పోస్టు పెట్టినా దానిని ఫాలోవర్లు ట్రెండింగ్లో నిలుపుతున్నారు. సరిగ్గా ఈ అనుకూలతను సమంత క్యాష్ చేసుకుంటోంది. కంపెనీలు తమ ప్రాడెక్టులకు సమంతను వినియోగించుకుంటున్నాయి. అందుకు ఆమెకు భారీ మొత్తంలోనే ముట్టజెపుతున్నాయంట. ఈ విధంగా సమంత నెలకు మూడు కోట్లకు పైగానే సంపాదిస్తోందని ఆయా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ విషయంలో కోహ్లీ ఒక్క బ్రాండ్ ప్రమోట్ చేయడానికి 50 కోట్లు, ప్రియాంక చోప్రా 3 కోట్లు, అలియా, కత్రినా ఒక్కో పోస్టుకు కోటి వసూలు చేస్తున్నారు. ఈ రకంగా సినిమాలకు మించిన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు సెలబ్రిటీలు.