Actress Samantha Looks Very Sick In Latest Photos
mictv telugu

కళావిహీనంగా సమంత మొహం.. భయంకర వ్యాధితో ఎలా అయిపోయిందో పాపం

November 7, 2022

Actress Samantha Looks Very Sick In Latest Photos

తాను మైయోసైటిస్ వ్యాధితో భాద పడుతున్నట్టు సమంత చేసిన సంచలన ప్రకటన ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. విడాకులతో పలు వివాదాలని మూటకట్టుకున సమంత డిప్రెషన్ లోకి వెళ్లిందని, దాంతో లక్షల్లో ఒకరికి వచ్చే అరుదైన మైయోసైటిస్ వ్యాధి బారిన పడిందని అంటున్నారు. దీంతో సమంతని ఓదారుస్తూ యావత్ టాలీవుడ్ పెద్దలు సంఘీభావం వ్యక్తంచేశారు. ఇక ఈ వ్యాధి కారణంగానో, ఇంకేంటో కానీ చాలారోజుల నుండి తన మొహం కనిపించకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తుంది సమంత. మొదట్లో ఇదెవ్వరు అంతగా పట్టించుకోకపోయినా.. జబ్బు వార్త తెలిసాక మాత్రం సమంత ఆరోగ్యం ఎలా ఉంది, వ్యాధి లక్షణాలు ఏంటీ, ఎందుకు జబ్బు వచ్చింది, ఇక సమంత ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అంటూ తన లేటెస్ట్ ఫొటోస్ ని తెగ సర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ సందర్భంలో చాలారోజులకి తన మొహాన్ని చూపెడుతూ.. తాజాగా రెండు ఫొటోలను అప్ లోడ్ చేసింది సమంత .

ఈ లేటెస్ట్ ఫొటోల్లో బ్లాక్ డ్రెస్, నల్ల కళ్లద్దాలను ధరించి ఉంది సమంత. గత కొన్ని రోజలుగా అనారోగ్యంతో బాధ [పడుతుందనే విషయం ఆమె కళ తప్పిపోయిన ఫేస్ లో స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఫొటోలో కాస్త అలసటగా, ఇంకాస్త అనారోగ్యంగా కనిపిస్తుంది సమంత. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ “నా మంచి స్నేహితుడు రాజ్ & డీకే చెప్పినట్లుగా.. రోజు ఎలా ఉన్నా.. ఎంత చెత్తగా ఉన్నా.. షేవ్ చేసుకొని షవర్ చేసి చూపించు అనేది అతని నినాదం. ‘యశోద’ మూవీ ప్రమోషన్స్ కోసం నేను ఒక రోజు దాన్ని అప్పు తీసుకున్నాను. ఈ 11న కలుద్దాం” అని సమంతా తన పోస్ట్ లో పేర్కొంది. అయితే ఫొటోలోనే కాదు పోస్టులో కూడా తన భాదని వ్యక్తీకరించింది సామ్. మనకి ఎంతటి కష్టాలున్నా అవేవి బయట కనిపించకుండా నవ్వుతు, ఫ్రెష్ గా ఉండాలని తన ఫ్రెండ్ చెప్పినట్టు.. తన కష్టాలని చెప్పకనే చెప్పింది సమంత.