Actress Samantha participated in Koffee with Karan show
mictv telugu

నీ వల్లే నా పెళ్లి జీవితం బాగా లేదు.. కేజీఎఫ్‌లా తయారైంది : సమంత వీడియో

July 2, 2022

Actress Samantha participated in Koffee with Karan show

కొన్ని రోజులుగా సమంత తన పెళ్లి, విడాకులు అంశంపై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షో ‘కాఫీ విత్ కరణ్‌’లో చెప్పిందని వార్తలు వచ్చాయి కదా. ఇప్పుడు ఆ షో ప్రోమో వచ్చేసింది. అందులో పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటు సమంత పాల్గొంది.

ఇందులో మిగతా ఇంటర్య్వూలు ఏమో కానీ, సమంత మాత్రం హైలెట్ అని చెప్పవచ్చు. ఇందులో కరణ్ పెళ్లి జీవితంపై సమంతను ప్రశ్నించగా, ‘నీ వల్లే నా పెళ్లి జీవితంలో సంతోషం లేకుండా పోయింది. పెళ్లి తర్వాత జీవితం ఇలా ఉంటుందని కభీ ఖుషీ కభీ ఘమ్ సినిమాలో మీరు చూపించారు. కానీ, నిజ జీవితంలో అందుకు విరుద్ధంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కేజీఎఫ్‌లో హీరోయిన్ లాంటి పరిస్థితి నాది’ అని నిర్మొహమాటంగా చెప్పేసింది. కాగా, ఈ షో వచ్చే వారం హాట్ స్టార్‌లో పూర్తి స్థాయిలో ప్రసారం కానుంది. ఇందులో పెళ్లి, విడాకులపై సమంత పూర్తి వివరణ ఇవ్వనున్నారని సమాచారం.