actress samantha started workouts and got emotional about her gym coach
mictv telugu

మళ్ళీ మొదలుపెట్టిన సమంత.. ఇంత జరిగినా మార్పు రాదా ?

November 13, 2022

అతి ఎప్పటికైనా ప్రమాదమే. హద్దులు దాటితే తిప్పలు తప్పవు. అయినా మార్పు లేకపోతే జీవితంలో షాక్ లు తప్పవు. సామర్ధ్యానికి మించి వర్కౌట్స్ చేస్తూ ఒకవైపేమో గుండెలు ఆగిపోతున్నాయి. వరుసగా సెలబ్రెటీలు హార్ట్ అటాక్స్ తో చనిపోతున్నారు. శరీర సామర్ధ్యానికి మించి జిమ్ లో అధిక శ్రమ చేయటమే హార్ట్ అటాక్స్ కి కారణమని డాక్టర్స్ సైతం హెచ్చరిస్తున్నారు. సమంతకి వచ్చిన మాయోసైటిస్ అనే వ్యాధి కూడా అధిక వర్కౌట్స్ చేయటంతోనే వచ్చిందని వైద్య నిపుణులు ఇప్పటికే చాలామంది చెప్పారు. కండరాల బలహీనత వస్తే రెస్ట్ తప్పనిసరి అని.. డైట్, లైఫ్ స్టైల్ మార్పులు చేసుకుని శక్తిని పునరుద్దించుకున్నాకే వర్కౌట్స్ మొదలెట్టాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా సమంత మళ్ళీ మొదలుపెట్టేసింది. తన యశోద సినిమా డబ్బింగ్ కూడా సెలైన్ పెట్టుకుని చెప్పానని తెలియగానే పెద్ద ఎత్తున సింపతీ వేవ్ క్రియేట్ అయిపోయింది. ఈ వేవ్ యశోద ఓపెనింగ్ కలెక్షన్స్ ని అమాంతం పెంచేసాయి.

అయితే సినిమా విడుదలైపోయింది, హిట్ టాక్ కూడా వచ్చేసింది. ఇప్పుడైనా తన ఆరోగ్యంపై పూర్తి ఫోకస్ పెట్టాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వేడుకుంటుంటే.. సమంత మాత్రం మళ్ళీ వర్కౌట్స్ స్టార్ట్ చేసేసింది. ఇన్ స్టా వేదికగా వర్కౌట్స్ మొదలుపెట్టినట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తన కోచ్ ని కలిసి ఎమోషనల్ కామెంట్స్ చేసింది సమంత. అనారోగ్యంతో కష్టాల్లోఉన్నప్పుడు తోడుగా నిలబడ్డాడని కోచ్ జునైద్ షేక్ ని ప్రశంసించింది సామ్. తనకోసం ప్రేమపూర్వక నోట్ రాస్తూ.. `నాకు ఇష్టమైన జలేబికి అర్హత సాధించడానికి నేను తగినంత చేసానని జునైద్ షేక్ ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ రోజు అతను యశోద విజయాన్ని ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను సెలబ్రేట్ చేసుకునేందుకు చాలా చేసాడు. గత కొన్ని నెలలుగా వీటన్నింటిని చూసిన కొద్ది మంది వ్యక్తులలో మీరు కూడా ఉన్నారు.. నేను బలహీనత తో ఉన్నప్పుడు.. కన్నీళ్ల ద్వారా.. అధిక మోతాదు స్టెరాయిడ్ థెరపీల ద్వారా.. అన్ని కష్టాల్లో ధీన స్థితిని మీరు చూశారు. అయినా మీరు నన్ను వదులుకోలేదు. మీరు నన్ను ఎప్పటికీ విడువరని తెలుసు.. ధన్యవాదాలు“ అని రాసుకొచ్చింది సమంత.