నటితో అసభ్య ప్రవర్తన..మాజీ ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు - MicTv.in - Telugu News
mictv telugu

నటితో అసభ్య ప్రవర్తన..మాజీ ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు

December 1, 2019

sanjana..

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కొడుకు ఆశీష్ గౌడ్ మాదాపూర్‌లోని పబ్‌లో నటి సంజన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై ఆమె మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై మద్యం బాటిళ్లతో దాడి చేసాడని, భవంతిపై నుంచి తోసి వేయడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించారు. శనివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో తన స్నేహితురాలితో కలిసివున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. 

పబ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తే నిజం తెలుస్తుందని సంజన వెల్లడించారు. ఆశీష్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సమయంలో చుట్టూ ఉన్నవారెవ్వరూ అతన్ని వారించలేదని ఆరోపించారు. బౌన్సర్ల సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని, వారు కూడా ఆశీష్‌ను పట్టించుకోలేదని వాపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆశిష్‌ గౌడ్‌పై సెక్షన్‌ 354, 354ఏ, 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.